ఎల్‌బీ నగర్ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్!

హైదరాబాద్ నగరం ఎన్ని రోడ్లు ఉన్నా, మెట్రో వంటి సౌకర్యాలు విస్తరిస్తున్నా ఇంకా రవాణా విషయంలో రద్దీగానే ఉంటుంది. ఇక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యల నుంచి కొంత మేరకు ఉపశమనం కలిగించే ప్లాన్ చేస్తోంది.ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎల్‌బీ నగర్ జోన్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఎల్‌బీ నగర్ జోన్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణం

ఈ ప్రాజెక్టుకు సుమారు 416 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కింద ఈ పనులు చేపట్టబోతున్నారు.
ఈ ఫ్లైఓవర్ గాయత్రి నగర్, టీకేఆర్ కాలేజీ మరియు మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా నిర్మించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో, కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈ పనులు చేపట్టనుంది. త్వరలోనే భూసేకరణ మరియు యుటిలిటీ షిఫ్టింగ్ పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

Hyderabad new LB Nagar flyover with six lane in lb nagar zone land aquisition soon for this project

రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి దశలవారీగా ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ పనులు

ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో బడంగ్‌పేట, అల్మాస్‌గూడ, మీర్‌పేట ప్రాంతాల నుంచి సంతోష్‌నగర్, పాతబస్తీ వైపు వెళ్లే వాహనదారులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో తూర్పు హైదరాబాద్‌లో జనాభా భారీగా పెరిగింది. దీంతో రోడ్డు ట్రాఫిక్ రద్దీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి దశలవారీగా ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు.

బడంగ్‌పేట- ఎల్‌బీ నగర్ జర్నీ సమయం తగ్గుదల

ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా బడంగ్‌పేట నుంచి ఎల్‌బీ నగర్ మీదుగా ప్రయాణం చేసేవారి జర్నీ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, రోడ్డు ప్రమాదాలు తగ్గి, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఇలాంటి మౌలిక సదుపాయాలు కీలకం. ఇప్పటికే నగరంలో అనేక ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించినా, ఎదుగుతున్న జనాభా మరియు వాహనాల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులు అవసరమవుతున్నాయి.

తూర్పు హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థకు ఊతంగా ఫ్లై ఓవర్

ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే తూర్పు హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. నిర్మాణ సమయంలో ఇంజనీర్లు, కార్మికులు, టెక్నీషియన్లు వంటి వివిధ రంగాల వారికి పనులు లభిస్తాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసి, నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తోంది.

జూన్ 15తర్వాత కేంద్రంతో యుద్ధమే.. ఐ డోంట్ కేర్: తేల్చి చెప్పిన సీఎం రేవంత్
జూన్ 15తర్వాత కేంద్రంతో యుద్ధమే.. ఐ డోంట్ కేర్: తేల్చి చెప్పిన సీఎం రేవంత్

హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్ట్ ఒక భాగం

భవిష్యత్తులో నగరంలో మరిన్ని ఇలాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గడం వల్ల ప్రజల రోజువారీ జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో ఈ తరహా ప్రాజెక్టులు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+