మహిళా పేషెంట్ ప్రైవేట్ భాగాలు తాకుతూ వైద్యుడి పైశాచికం: పదేళ్ల జైలు
హైదరాబాద్: వైద్యుడే నారాయణుడని రోగులు వారి వద్దకు వెళుతుంటారు. కానీ, ఓ వైద్యుడు మాత్రం కామంతో కళ్లుమూసుకుపోయి వైద్యం కోసం వచ్చిన మహిళా రోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ భాగాలను తాకుతూ ఆమెను లైంగికంగా వేధించాడు. ఇలా పలుమార్లు చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. చివరకు ఆ కామాంధుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మహిళా పేషెంట్ ప్రైవేట్ భాగాలు తాకుతూ పైశాచికం
కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని భాస్కర్ చెస్ట్ క్లినిక్‌కు వెళ్లింది. శ్వాసకోశ నిపుణులు విజయ్ భాస్కర్ వైద్యం పేరుతో మహిళ ఛాతిపై చేతులతో తడిమి, ఆ తర్వాత ఆమె ప్రైవేట్ భాగాలను తాకి ఇబ్బందికి గురిచేశాడు. అనుమానం వచ్చిన బాధితురాలు ప్రశ్నించగా.. చికిత్సలో భాగంగానే అలా చేసినట్లు వైద్యుడు విజయ్ భాస్కర్ తెలిపాడు.

మరో యువతితోనూ అసభ్యకరంగా వైద్యుడు, గొడవతో..
కాగా, 2016 సెప్టెంబర్ 24న అదే క్లినిక్‌కు వెళ్లిన బాధితురాలితో అదే తరహాలో వ్యవహరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయింది బాధితురాలు. 2016 అక్టోబర్ 7న మరోసారి వెళ్లిన బాధితురాలికి అక్కడ ఓ యువతి విజయ్ భాస్కర్‌తో గొడవపడటం గమనించింది. కారణం ఆరా తీయగా.. ఆ యువతితోనూ సదరు వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో వైద్యుడి ప్రవర్తనలోనే తేడా ఉన్నట్లు గమనించిన బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఈ క్రమంలో 2016, అక్టోబర్ 8న బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విజయ్ భాస్కర్ ను అరెస్ట్ చేశారు.

పాపం పండింది.. కీచక వైద్యుడికి పదేళ్ల జైలు శిక్ష
ఆ తర్వాత విజయ్ భాస్కర్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, గోపాలపురం పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయస్థానం విజయ్ భాస్కర్ ను దోషిగా తేల్చింది. పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధించింది. కాగా, 2016లోనే గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే విజయ్ భాస్కర్ పై ఓ యువతి ఫిర్యాదు చేయగా, ఈ కేసులో నాంపల్లి కోర్టు అతడ్ని నిర్ధోషిగా తేల్చింది. దీన్ని సవాల్ చేస్తూ బాధిత యువతి హైకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఆ కేసు కూడా విచారణలో ఉందని గోపాలపురం పోలీసులు తెలిపారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
సికింద్రాబాద్-శ్రీకాకుళం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications