హై అలెర్ట్.. హైదరాబాద్ లో "క్లౌడ్ బరస్ట్".. ఈ రాత్రి ఆకస్మిక వరదలు..!

హైదరాబాద్‌ లో ఇవాళ ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిన క్రమంలో ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌ మెట్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. ఇక పంజాగుట్ట, ఐకియా, దిల్‌ సుఖ్‌ నగర్, మలక్ ‌పేట్, అత్తాపూర్ ప్రాంతాల్లో వర్ష బీభత్సం కారణంగా ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. పాతబస్తీలోని సంతోష్‌ నగర్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, కంటోన్మెంట్‌ లోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అయితే తెలంగాణలోని హైదరాబాద్ లో "క్లౌడ్ బరస్ట్" ఏర్పడినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మరో గంటలో 80 నుంచి 100 ఎంఎం ల భారీ వర్షంతో పాటు వరదలు నమోదు అవుతాయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆకస్మిక వర్షాలకు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో వరదలు వ్యాపించే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు సీఎస్‌, డీజీపీ, హైడ్రా కమిషనర్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్ చేశారు. భారీ వర్ష సూచనపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 2 రోజులపాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురుస్తాయన్న సంకేతాల నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులతో పరిస్థితి సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షాలు కారణంగా అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. హైదరాబాద్ లో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇక హైదరాబాద్‌ సిటీలో పెనుగాలులతో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, మాదపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad on High Alert Cloudburst Threat Brings 80-100 mm Rain Flooding Looms

ఇటీవల ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కావడంతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+