సహజీవనం: నగ్న చిత్రాలతో ప్రియురాలి బ్లాక్‌మెయిల్
హైదరాబాద్: ప్రేమించి ఐదేళ్లు సహజీవనం చేసిన ప్రియురాలి నగ్న దృశ్యాల్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న బాషా అనే యువకుడిని ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి ఈ విషయం ఎవరికైనా చెబితే నగ్న దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు.
అతని బ్లాక్‌మెయిల్ భరించలేక బాధితురాలి కుటుంబం హైదరాబాద్ విడిచిపెట్టి మెదక్ వెళ్లిపోయింది. అయినా అతని వేధింపులు ఆగలేదు. దీంతో ఆ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు ట్రాప్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాషాపై సెక్షన్‌లతోపాటు నిర్బయ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా, సోమవారం ఉదయం యువతి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మహిళకు వేధింపు, భర్త తలపై సీసాతో దాడి

తప్పతాగిన నలుగురు యువకులు ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అడ్డుకున్న భర్త తలపై బీరుసీసాతో బాది తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణం బాల్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. సాయంత్రం పొలంలో పశువులను మేపుతున్న మహిళను పక్కనే మద్యం తాగుతున్న గౌతం, అశోక్, రాజు, ఉదయ్‌లు లైంగిక వేధింపులకు గురి చేశారు.
చుట్టు పక్కల వారు వారించినా వినలేదు. భర్త అక్కడికి చేరుకుని అడ్డుకోబోయాడి. అతనిపై ఆ నలుగురు యువకులు బీరుసాసీతో దాడి చేశారు. బీరుసీసాతో కొట్టడంతో తలకు తీవ్రంగా గాయమైంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications