హైటెక్ వ్యభిచార ముఠా పట్టివేత: దొరికిన కోల్‌కతా మోడల్
హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ కేంద్రంగా గుట్టుగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం చేస్తూ కోల్‌కత్తా మోడల్ పోలీసులకు దొరికింది. హైటెక్ వ్యభిచార నిర్వాహకుడిని, మోడల్‌ను, మోడల్ అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం వెల్జర్‌లోని ఓ ప్రాచీన దేవాలయంలో గల వినాయక విగ్రహాన్ని చోరీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. క్రేన్ సహాయంతో భారీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు.

ఈ ప్రయత్నంలో దొంగలు తెచ్చిన క్రేన్ భూమిలో దిగబడిపోయింది. దీంతో క్రేన్‌ను అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వరంగల్ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా ఆలేరు శివారులో రాఘవరెడ్డి వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాఘవరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications