IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!!

IPL 2026 సందడి మొదలైంది. క్రికెట్ ఫ్యాన్స్ పండుగ లాంటి సీజన్. సమయంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతుంటారు. ఐపీఎల్ వేళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఐపీఎల్ బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతు న్నారు. ఇందులో భాగంగా తాజాగా.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ లకు దూరంగా ఉండా లని సూచించారు. అదే సమయంలో కీలక హెచ్చరికలు చేసారు.

ఐపీఎల్ ప్రారంభం వేళ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక సందేశం ఇచ్చారు. ఐపీఎల్ ప్రారంభం అవుతున్న వేళ క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించండి. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బుకోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయె న్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పైనా ప్రత్యేక నిఘా పెట్టినట్లు హెచ్చరించారు.

hyderabad-police-commissioner-v-c-sajjanar-has-issued-a-strong-advisory-urging-young-people-to-avo

బెట్టింగ్ జరిగితే కఠిన చర్యలు

ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రదేశాల్లో జరిగే బెట్టింగ్‌లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. బెట్టింగ్ మాఫియా చేతుల్లో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ విజ్క్షప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+