హైదరాబాద్ మహిళలకు పోలీసులు బంపర్ ఆఫర్
హైదరాబాద్ లో నివసించే మహిళలకు నగర పోలీసులు శుభవార్త వినిపించారు. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముందుకొచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఉద్యోగ మేళాను కూడా నిర్వహించనున్నారు. జనవరి 3వ తేదీన అంబర్ పేట్ పీటీసీలో ఉద్యోగ మేళా, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించబోతోన్నట్లు వెల్లడించారు. దీనికి అంబర్ పేట్ లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వేదిక కానుంది.
ఈ విషయాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. తెలంగాణ పోలీసులు, భరోసా, మహిళల భద్రత విభాగం, మోవో సోషల్ ఇనిషియేటివ్స్ సంయుక్తంగా మహిళల కోసం ప్రత్యేక ఉద్యోగ మేళా, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులకు సురక్షిత రవాణా అందించడం, వారికి స్వయం ఉపాధి కల్పించడం, మహిళలను బైక్ ఈ-ఆటో టాక్సీ డ్రైవర్లుగా తీర్చిదిద్దడమే ఈ మేళా ముఖ్యోద్దేశ్యం.

ఈ ఉద్యోగ మేళా జనవరి 3వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంబర్‌పేట్‌లోని పీటీసీలో జరుగుతుంది. ఇందులో బైక్, స్కూటర్, ఈ-ఆటో డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తారు. మహిళా ట్రైనర్ల ద్వారా ఉద్యోగ నైపుణ్యాలు, భద్రతకు సంబంధించిన శిక్షణను కూడా కల్పిస్తారు. శిక్షణ పూర్తి కాగానే లైసెన్స్ సౌకర్యం, అలాగే 100 శాతం ఉద్యోగ ప్లేస్‌మెంట్‌కు హామీ ఇస్తారు. ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ జారీలో సహకారం అందిస్తారు. డ్రైవింగ్ అనుభవం లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
మహిళలకు మూడు నెలల పాటు మెంటార్‌షిప్, కౌన్సెలింగ్‌తో పాటు వాహనాల అద్దె/రుణ సదుపాయాన్ని కూడా అందిస్తారు. 21-45 సంవత్సరాల వయస్సు గల మహిళలు దీనికి అర్హులు. డ్రైవింగ్ లో అనుభవం కూడా అవసరం లేదు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు వాటిని తీసుకురావచ్చు. ఈ జాబ్ మేళాకు హాజరు కావాలనుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును తమవెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా కోసం తమ పేర్లను నమోదు కోసం 8978862299 నంబర్‌ను సంప్రదించాలని సజ్జానర్ సూచించారు.












Click it and Unblock the Notifications