మందుబాబులకు బిగ్ షాక్ - రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్..!!
మందుబాబులకు బిగ్ షాక్. ఒకే సారి రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. బోనాల పండుగ సందర్భంగా గ్రేటర్ పరిధిలో జోన్ల వారీగా మద్యం అమ్మకాల పైన ఆంక్షలు విధించారు. అదే విధంగా వరసగా రెండో శనివారం, ఆదివారం తరువాత ఈ నెల 10వ తేదీన బోనాల సందర్భంగా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో.. ఇప్పుడు మొత్తం బోనాల సందడి కొనసాగుతోంది.
బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 9వ తేదీన బోనాలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బోనాల పండుగ నాడు పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు. ఆ రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని సీపీ రమేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అయితే, స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు మినహాయింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
కాగా, రాజేంద్రనగర్, గోల్కొండ జోన్ల పరిధిలో ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 10వ తేదీ ఉదయం 10గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. అదే విధంగా చార్మినార్ జోన్ పరిధిలో లో ఆగస్టు 9న ఉదయం 10 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 9 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్దేశించారు. అందరూ వేడుకగా జరుపుకు నే బోనాల ఉత్సవాల వేళ ప్రజా శాంతి, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక.. మూడు రోజుల పాటు బోనాల వేళ విద్యా సంస్థలకు వరుస సెలవులు ప్రకటించారు. ప్రతీ ఏటా వైభవంగా నిర్వహించే బోనాల కోసం ఈ సారీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications