ఫ్రెండ్లీ పోలీసింగ్: హైదరాబాద్ పిఎస్‌లకు ఫేస్‌బుక్ ఖాతా(పిక్చర్స్)
హైదరాబాద్: పోలీసు శాఖలో ఇప్పటివరకు సైబర్ క్రైం విభాగానికి మాత్రమే ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ ఇప్పుడు అన్ని పోలీస్‌స్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలతో పాటు 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, క్రైమ్స్ అదనపు కమిషనర్ స్వాతిలక్రాతో కలిసి మంగళవారం ఖాతాలను ప్రారంభించారు.
ఫేస్‌బుక్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ అని ఐడీని టైపు చేస్తే నగరంలో అన్ని ఠాణాల పేర్లతో ఖాతాలు కనిపిస్తాయి. వీటిని ప్రారంభించిన అనంతరం అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. అసోంలోని గౌహతిలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన డీజీపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్మార్ట్ పోలీసింగ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని పోలీసుస్టేషన్లకు ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరిచామన్నారు.
ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, తిష్ఠవేసిన అనుమానితుల గురించి ఇందులో తెలియజేయవచ్చన్నారు. పోలీసు పరంగా ఉన్న సమస్యలతో పాటు, సూచనలు, సలహాలకు సంబంధించి ఇందులో పోస్ట్‌లు చేయవచ్చన్నారు. ఫిర్యాదులను ఫేస్‌బుక్‌లో తీసుకునే అంశాన్ని మాత్రం త్వరలో పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని మండలాల ఉపకమిషనర్లు పాల్గొన్నారు.

ఠాణాలకు ఫేస్‌బుక్
పోలీసు శాఖలో ఇప్పటివరకు సైబర్ క్రైం విభాగానికి మాత్రమే ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ ఇప్పుడు అన్ని పోలీస్‌స్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది.

ఠాణాలకు ఫేస్‌బుక్
నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలతో పాటు 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు.

ఠాణాలకు ఫేస్‌బుక్
బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, క్రైమ్స్ అదనపు కమిషనర్ స్వాతిలక్రాతో కలిసి మంగళవారం ఖాతాలను ప్రారంభించారు.

ఠాణాలకు ఫేస్‌బుక్
ఫేస్‌బుక్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ అని ఐడీని టైపు చేస్తే నగరంలో అన్ని ఠాణాల పేర్లతో ఖాతాలు కనిపిస్తాయి.

ఠాణాలకు ఫేస్‌బుక్
వీటిని ప్రారంభించిన అనంతరం అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. అసోంలోని గౌహతిలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన డీజీపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్మార్ట్ పోలీసింగ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని పోలీసుస్టేషన్లకు ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరిచామన్నారు.
-
విజయవాడ ఉగ్ర కుట్ర కేసు: ఇన్‌స్టా రీల్స్ వెనుక భయంకరమైన కోణం? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications