అప్పు ఇచ్చి లైంగిక వేధింపులు, బాధితురాలిలా..
హైదరాబాద్: అప్పు ఇచ్చిన కారణంగా మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న డ్యాన్స్ అకాడమీలో పిఆర్ఓగా పనిచేస్తోన్న ఈసాక్ రూబిన్‌ను ఎల్‌బినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వనస్థలిపురానికి చెందిన 32 ఏళ్ళ మహిళ శివగంగ కాలనీలో డ్యాన్స్ అకాడమీలో డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో ఈసాక్ రూబిన్ అకడమిక్ పిఆర్ఓగా పనిచేస్తున్నాడు.
ఆ మహిళ ఇసాక్ రూబిన్ వద్ద రూ. 27వేలు అప్పుగా తీసుకొంది. దీంతో ఆ మహిళ పట్ల రూబిన్ అసభ్యంగా ప్రవర్తంచడం ప్రారంభించాడు. అంతేకాదు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

తాను చెప్పినట్టు వినకపోతే తనపై భర్తకు, కుటుంబసభ్యులకు తప్పుడుగా చెబుతానని బాధితురాలిని రూబిన్ బెదిరించాడు. దీంతో ఆమె రూబిన్ వద్ద తీసుకొన్న అప్పును వెంటనే చెల్లించింది.
అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల 10వ, తేదిన బాధితురాలిపై డ్యాన్స్ అకాడమీలోనే రూబిన్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications