భండారి లే అవుట్.. మళ్లీ అదే కథ: భారీ వర్షానికి చెరువులా!..
సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. లేఅవుట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.
హైదరాబాద్: పాత కథే మళ్లీ రిపీటైంది. గతేడాది లాగే నిజాంపేట భండారి లేఅవుట్ మళ్లీ చెరువును తలపిస్తోంది. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. లేఅవుట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద నీరు బయటకు పోవడానికి మార్గం లేకపోవడంతో.. మరోసారి భండారి లేఅవుట్ జలదిగ్బంధంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
కాలనీలోకి వచ్చే నీటిని బయటకు పంపించడానికి కబ్జా నిర్మాణాలు అడ్డంకిగా మారాయి. వరద కాల్వలపై కబ్జా నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహానికి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో కాలనీలో చేరిన నీరు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి.

సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భండారి లేఅవుట్ లో పరిస్థితిపై ఆందోళన నెలకొంది. సమీపంలోని తుర్క చెరువు కట్ట పటిష్టం చేసేందుకు గత నెల రోజులుగా అధికారులు శ్రమిస్తున్నారు. చెరువు నిండిన తర్వాత పాపయ్య కుంటలోకి మత్తడి ద్వారా నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, గతేడాది కూడా మోకాలి లోతు వరద నీటిలో చిక్కుకుని భండారి లే అవుట్ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కూడా నీటిలో మునిగిపోవడంతో అప్పట్లో ఆ ప్రాంతానికి కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications