డెడ్లీ రెయిన్- ఒక్క వాన దెబ్బకు హైదరాబాద్ బ్లాక్ అవుట్

Hyderabad rains: అకాల వర్షానికి హైదరాబాద్.. అతలాకుతలమైంది. అల్లకల్లోలానికి గురైంది. ఏకబిగిన కుండపోతగా కురిసిన అతి భారీ వర్షం దెబ్బకు చివురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు నివాసాల్లో వర్షపునీరు చేరింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల జనం అంధకారంలో గడిపారు.

మహారాష్ట్ర నుండి మన్నార్ గల్ఫ్ వరకు మరాఠ్వాడ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి కిలో మీటర్ ఎత్తులో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ బెల్ట్‌లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్ష తీవ్రత నేడు కూడా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

Hyderabad rains several trees uprooted and huge crane collapsed in the city

ఈ ద్రోఫీ ప్రభావంతో దాదాపు రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులు వీచాయి. వర్షం ధాటికి నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద నీరు రోడ్లపై పోటెత్తింది. ప్రవాహాన్ని తలపించింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనదారులు గంటల కొద్దీ పడిగాపులు పడాల్సొచ్చింది.

టోలీచౌకి, షేక్‌పేట్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, నానల్ నగర్, లంగర్ హౌజ్, గోల్కొండ, పాతబస్తీ, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రోడ్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సోమాజిగూడ, ప్రకాష్ నగర్, మెట్టుగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, రాణిగంజ్, నాంపల్లి, కోటి, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.

శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో 60కి పైగా చెట్లు నేలకూలాయి. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. విద్యుత్ సిబ్బంది, పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సహాయంతో హైడ్రా చెట్లను తొలగించే పనులను చేపట్టింది.

నల్లకుంట, సరూర్‌నగర్, విజయనగర్ కాలనీ, దారుస్సలాం, హైకోర్టు, బీఎన్ రెడ్డి నగర్, ఫలక్‌నుమా, సుల్తాన్ బజార్, కాచిగూడ, సింధి కాలనీ, మెథడిస్ట్ కాలనీ వంటి ప్రాంతాల్లో చెట్లు నేలకూలినట్లు హైడ్రా వెల్లడించింది. అబిడ్స్‌లో ఓ భారీ క్రేన్ సైతం విరిగి పడటం వర్షాలు, ఈదురు గాలులు తీవ్రతకు అద్దం పట్టింది.

మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+