ప్రపంచంలోని టాప్ 100 సిటీస్ లో హైదరాబాద్.. ఎన్నో స్థానం అంటే..?

హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ సిటీగా అంతర్జాతీయ స్థాయులో దూసుకెళ్తోంది. వరల్డ్ లోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతోంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం.. దిగ్గజ కంపెనీలకు అనువైన స్పాట్ గా మారుతోంది. భాగ్యనగరంలోని చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా ప్యాలెస్, రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. అలాగే హైదరాబాదీ బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్ ఎంతో ఫేమస్.

అలాగే హైదరాబాద్ లో అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, డెలాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఆపిల్, క్వాల్కమ్.. తదితర అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయి. ఇక 2025 నాటికి.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా సుమారు 1.12 కోట్లు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు.. తదితర నిర్ణయాలతో భాగ్యనగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ది చేస్తోంది.

ఇదిలాఉంటే.. తాజాగా హైదరాబాద్ మహానగరం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోని అత్యుత్తమ 100 నగరాల్లో స్థానాన్ని సంపాదించుకుంది. భారత్ నుంచి బెంగళూరు 29 వ స్థానంలో నిలిచింది. అలాగే దిల్లీ 54 వ స్థానంలో ఉంది. హైదరాబాద్ 82 వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్టును రెజోనాస్స్ అనే సంస్థ ప్రకటించింది. ఈ లిస్టులో భారత్ నుంచి మూడు నగరాలు లిస్టులో చేరాయి. అయితే ఈ జాబితాలో హైదరాబాద్ మహానగరం 82 వ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

Hyderabad Ranks 82nd in World s Top 100 Best Cities 2026 A Global Milestone for the City of Pearls

ఇక 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్టులో లండన్ టాప్ ప్లేస్ లో నిలిచింది. రెండోస్థానంలో న్యూయార్క్, మూడోస్థానంలో ప్యారిస్, నాలుగోస్థానంలో టోక్యో, ఐదోస్థానంలో మాడ్రిడ్ ఉన్నాయి. ఎకనామిక్ గ్రోత్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, టూరిజం, సేఫ్టీ, పర్యావరణం, క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవనశైలి.. తదితర వాటిని పారామీటర్లుగా తీసుకుంది. హైదరాబాద్ లో టెక్, ఫార్మా కంపెనీలు విస్తృతంగా ఉన్నాయి. జీనోమ్ వ్యాలీ.. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ లకు వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+