అమర్ ల్యాబ్‌లో పేలిన రియాక్టర్: 9 మందికి తీవ్రగాయాలు

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమర్ ల్యాబ్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రమాదం జరిగని సమయంలో పరిశ్రమంలో 15 మంది వరకు కార్మికులు ఉన్నారని సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 Hyderabad: reactor blasted in amar lab factory, 9 workers seriously injured

కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భవానీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే వీరు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బోయిన్‌పల్లికి చెందిన శ్రీకాంత్ చారి (42)కి భూదాన్ పోచంపల్లికి చెందిన అక్షయకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి స్రవంతి (8), శ్రావ్య (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ సిల్వర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే కుటుంబసభ్యులంతా కలిసి గురువారం రాత్రి భోజనం చేసి నిద్రించారు. శుక్రవారం ఉదయం లేచి చూస్తే.. పిల్లలతో సహా శ్రీకాంత్ విగతజీవిగా పడి ఉన్నాడు. గమనించిన భార్య అక్షయ .. కింది అంతస్తులో ఉంటున్న తన అత్త జయమ్మకు విషయం చెప్పారు.

అయితే, దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు. భర్తతోపాటు పిల్లలు చనిపోవడంతో భార్య అక్షయపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైనెడ్ తీసుకుని వారు మృతినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యలపై అక్షయను ప్రశ్నించారు. రాత్రి అంతా కలిసి భోజనం చేశామని, ఎలాంటి గొడవలు లేవని.. అయితే, తెల్లాసరికే భర్తతోపాటు పిల్లలు మరణించారంటూ అక్షయ కన్నీటిపర్యంతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+