వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాలో ORR సర్వీస్ రోడ్డు క్లోజ్..
హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద ప్రవాహంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉద్యోగం, ఉపాధి, స్కూల్స్, కాలేజీలకు వెళ్లేవాళ్లు నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. వరద ప్రవాహం మరింత పెరగడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.
గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయం అయింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హైదరాబాద్ తో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేశారు.
భారీ వరద కారణంగా హిమాయత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు వెళ్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ORR సర్వీస్ రోడ్డును మూసివేశారు. ఈమేరకు రాజేంద్రనగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు రాకపోకలు నిలిపివేశారు. సర్వీస్ రోడ్డుపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను మళ్లించి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, జగిత్యాల లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటల తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications