ఏకంగా 1638 క్రెడిట్ కార్డులు వాడుతున్న హైదరాబాద్ వాసి..!
ప్రస్తుతం కాలంలో క్రెడిట్ కార్డు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గతంలో షాపింగ్ లేదా అత్యవసర అవసరాల కోసమే ఈ కార్డులు వాడేవారు. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ వీటి వినియోగం పెరిగింది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా అందరూ కనీసం ఒక క్రెడిట్ కార్డు వాడుతున్నారు. జీతం నెల చివరి వరకు సరిపోని పరిస్థితుల్లో ఈ కార్డులు చాలా మందికి ఆధారంగా మారాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఒక ఆపద్భాందవుడుగా నిలుస్తోంది.
కాగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులు ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కానీ ఒక వ్యక్తి 10 లేదా 20 కార్డులు వాడతాడు అంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని గిన్నిస్ రికార్డులకే ఎక్కింది. ఆ వివరాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

గిన్నిస్ రికార్డు..
హైదరాబాద్‌కి చెందిన మనీష్ ధమేజా అనే వ్యక్తి ఏకంగా 1,638 క్రెడిట్ కార్డులు వాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. ప్రపంచంలో అత్యధిక క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన వ్యక్తి భారతీయుడు కావడం అది కూడా తెలంగాణకు చెందిన వాడు కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మనీష్ ఇన్ని కార్డులను ఎలా వాడుతున్నాడు అని అందరికి ప్రశ్నగా మారింది.
మనీష్ మాట్లాడుతూ.. క్రెడిట్ కార్డులు నా జీవితంలో ఒక పెద్ద భాగం. ఇవి లేకుండా నా జీవితం అసంపూర్ణం. వీటి ద్వారా నేను అనేక ప్రయోజనాలు పొందుతున్నాను. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, స్పా వోచర్లు, హోటల్ బుకింగ్ డిస్కౌంట్లు, ఫ్రీ మూవీ టిక్కెట్లు, గోల్ఫ్ సెషన్లు, ఫ్యుయల్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు.. ఇవన్నీ నాకు ఈ కార్డుల వల్లే లభించాయని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. కొంతమంది యువత అయితే "మాకు ఒక కార్డు కూడా ఇవ్వు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications