తెలంగాణ స్కూళ్లలో ఇకపై నో బ్యాక్ బెంచ్..! వాట్ ఏన్ ఐడియా సర్జీ..
సాధారణంగా క్లాసు రూముల్లో బ్యాక్ బెంచ్, ఫ్రంట్ బెంచ్ అని పిలుస్తుంటారు. బ్యాక్ బెంచ్ లో కూర్చొన్న విద్యార్థులకు అంత ప్రతిభ ఉండదని.. సరిగ్గా చదవని విద్యార్థులే వెనుక బెంచ్ లో కూర్చొంటారని కొందరి అభిప్రాయం. అలాగే టీచర్ చెప్పే పాఠాలు ఆసక్తిగా వినని కొంత మంది విద్యార్థులు బ్యాక్ బెంచ్ లో కూర్చుని తమకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చదవడమో.. కొంత మంది మొబైల్ చూడటమో, మరి కొంత మంది ముచ్చట్లు పెట్టడమూ చేస్తుంటారు. అయితే ఇకపై తెలంగాణలోని పాఠశాలల్లో అలాంటి అవకాశం లేదన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బ్యాక్ బెంచ్ సీటింగ్ కు స్వస్తి చెప్పి యూ టైప్ సీటింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
మలయాళంలో ఓ చిత్రం ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. అదే స్థానార్థి శ్రీ కుట్టన్. ఈ మూవీలో బ్యాక్ బెంచ్ విధానం కాకుండా యూ ఆకారపు సీటింగ్ విధానం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తరగతి గదిలో ఈ విధానంలో కూర్చోబెడితే విద్యార్థుల మధ్య అసమానతలను తొలగిపోతాయని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సినిమాలో వివరించారు. ఇప్పుడు ఆ మూవీ స్ఫూర్తితో హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో U ఆకారం సీటింగ్ అమలు చేయాలని తాజాగా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని క్లాసుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇది సక్సెస్ అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
స్థానార్థి శ్రీకుట్టన్ సినిమా ప్రేరణతో కేరళలోని వివిధ పాఠశాలలు మొదట ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయి. విద్యార్థులను తరగతి గదిలో 'యూ' ఆకారంలో కూర్చొబెట్టి పాఠాలను చెప్పడం ప్రారంభించారు. ఆ తరువాత ఈ వ్యవస్థను తమిళనాడు, పంజాబ్ లోని కొన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. ఇటీవల ఈ విధానం బెంగాల్ లోనూ ప్రవేశపెట్టారు.

దీంతో హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో U ఆకారం సీటింగ్ అమలు చేయాలని తాజాగా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ లో విజయవంతం అయితే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.












Click it and Unblock the Notifications