Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనూహ్యం, కేసీఆర్ కు మద్దతుగా సీమాంధ్ర ఓటర్లు - పవన్ ఆశలు గల్లంతు..!!

తెలంగాణలో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. బీఆర్ఎస్ కంచుకోటల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. అనూహ్యంగా బీజేపీ పది స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ ఫలితాల్లో అనూహ్య సమీకరణం కనిపిస్తోంది. సీమాంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు తెలంగాణలో కేసీఆర్ కు మద్దతుగా నిలిస్తే..కోర్ తెలంగాణలోని ఓటర్లు కాంగ్రెస్ వైపు నిలిచారు. బీఆర్ఎస్ సెటిలర్ల మద్దతు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతోంది.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విశ్వాసం ఓటర్లు దెబ్బ తీసారు. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యాన్ని దెబ్బ తీసారు. బీఆర్ఎస్ కంచుకోటల్లో ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో కొన్ని వర్గాలు బీజేపీకి మద్దతుగా నిలిచాయి. తొలి నుంచి తెలంగాణ పార్టీగా..తెలంగాణ ప్రజలు ఆదరిస్తూ వచ్చిన నియోకవర్గాల్లోనూ కారు బోల్తా కొట్టింది. ఆ పార్టీకి పట్టున్న దక్షిణ ,ఉత్తర తెలంగాణ లో ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో అనూహ్యంగా సీమాంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ కు అండగా నిలిచినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో సీమాంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతోంది.

Hyderabad Settlers form Seemandhra Area voters seem to be support BRS in Assembly Elections

హైదరాబాద్ లో 7 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 4, ఎంఐఎం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రంగారెడ్డిలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. మెదక్ లో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యత లో ఉన్నాయి. సీమాంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్ గిరి, ఉప్పల్, శేరి లింగంపల్లి, కుకట్ పల్లి, సనత్ నగర్, కుత్బుల్లా పూర్, రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ అధిక్యతలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. చంద్రబాబు అరెస్ట్ తో సీమాంధ్ర ప్రాంత వాసులు తెలంగాణ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ కు అండగా నిలుస్తారనేది గ్రేటర్ లో నిరూపణ కాలేదు. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇక, పవన్ తమకు సీమాంధ్ర ప్రాంత ఓటర్ల మద్దతు తెచ్చి పెడతారనే బీజేపీ ఆశలు గల్లంతు అయినట్లు కనిపిస్తోంది. జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనూ ప్రత్యర్ధి పార్టీలు ఆధిక్యతలో ఉన్నాయి. దీని ద్వారా ఇప్పుడు సీమాంధ్ర ఓటర్ల మూడ్ ఏంటనేది స్పష్టం అవుతున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ఫలితాలు పూర్తిగా వెల్లడైన తరువాత సీమంధ్ర ఓటర్లు ఏ మేర బీఆర్ఎస్, కాంగ్రెస్ కు అండగా నిలిచారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+