షాక్: భర్తతో విడిపోయిన టెక్కీని నమ్మించి నగ్న వీడియోలను తీసి ఇలా...

హైదరాబాద్: భర్తతో విడిపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించి మోసం చేశాడు టెక్కీ. అయితే భర్త వేధింపులు భరించలేక స్నేహితుడి మోసం నుండి తేరుకోలేక ఆత్మహత్యచేసుకోవాలని భావించిన బాధితురాలిని స్నేహితులు ఓదార్చి షీటీమ్స్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.బాధితురాలు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు నిందితుడిని షీ టీమ్స్ అరెస్టు చేశారు.

హైద్రాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వారికి ఓ పాప కూడ పుట్టంది. పాప పుట్టిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకొన్నాయి. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఆమె ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది.

అయితే అదే కంపెనీలో పనిచేసే సహోద్యోగి ఆమెను స్నేహం పేరుతో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. ఆమె గతం తెలుసుకొన్నాడు. ఆమెకు , ఆమెకు కూతురికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.

Hyderabad sheteams arrested a techie for sexual harassment

గతం మర్చిపో..కొత్త జీవితం ప్రారంభించు అంటూ సినిమా డైలాగులు కొట్టాడు. ఈ మాటలను లేడీ టెక్కి అతడిని నమ్మింది.అతడిలో నిజమైన ప్రేమ ఉందని భావించింది. నీతో పాటు పాపను కూడ చూసుకొంటానంటూ నిందితుడు ఆమెకు ధైర్యం చెప్పాడు.

దీంతో ఇద్దరూ కలిసితిరిగారు. అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకొనేందుకుగాను ఉప్పల్ వద్ద ఏడులక్షలతో సన్ సీటీ వద్ద ఫ్లాట్ కొనుగో్లు చేశాడు. కొన్నిరోజులు అక్కడే కాపురం చేశారు.

అయితే అతడి నిజస్వరూపం వెలుగుచూసింది. బాధితురాలు స్నానం చేస్తుండగా ఆమె నగ్న వీడియోలు చిత్రీకరించాడు. పడక గదిలోని దృశ్యాలను కూడ చిత్రీకరించాడు. క్రమంగా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.

అయితే ఈ విషయమై బాధితురాలు నిందితుడిని ప్రశ్నించింది. అయితే అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్నవీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. అతడిమాటలకు షాకైంది. భర్త వేధింపుల నుండి స్నేహితుడు స్వాంతన చేకూర్చుతాడని భావిస్తే మోసగాడని తెలుసుకొని ఆమె కుమిలిపోయింది.

అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.అయితే అదే సమయంలో ఆమె స్నేహితులు అండగా నిలిచారు. వారి సహాయంతో ఆమె షీటీమ్స్ ను ఆశ్రయించారు. షీ టీమ్స్ నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+