హైదరాబాదులో హోటల్‌పై నుంచి దూకిన బెంగళూర్‌వాసి: మహిళతో గదిలో...
హైదరాబాద్: ఇటీవల హైదరాబాదులోని లక్డీకాపూల్‌లో గల ఓ హోటల్ పైనుంచి దూకి బెంగళూరుకు చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అధికారిక కార్యక్రమంపై హైదరాబాదుకు వచ్చిన బెంగళూరుకు చెందిన వ్యక్తి ఇటీవల హోటల్‌పై నుంచి దూకి మరణించిన విషయం తెలిసిందే.
హోటల్‌లో కిటికీ నుంచి దూకడంతో అతను మరణించాడు. అతన్ని 34 ఏళ్ల అంజిలో రోడ్రిగ్స్‌గా గుర్తించారు. ఘన వ్యర్థపదార్థాల నిర్వహణపై పనిచేస్తున్న ఓ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లో అతను పనిచేస్తున్నాడు. 17 మంది సహోద్యోగులతో అతను జులై 1వ తేదీన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు.

వారంతా హైదరాబాదులోని లక్డికాపూల్‌లో గల ఓ హోటల్‌లో దిగారు. అయితే, రోడ్రిగ్స్ తన సహోద్యోగులకు ఎవరికీ చెప్పకుండా అదే హోటల్‌లోని మరో గదికి మారాడు.

అతనితో పాటు ఆ సమయంలో అతని మహిళా సహోద్యోగి ఉంది. మహిళతో రాత్రి గడిపాలనే ఉద్దేశంతో అతను గది మారినట్లు చెబుతున్నారు. అదే అతని కొంప ముంచింది. అతని సహోద్యోగులు వచ్చి తలుపు తట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో అతను హోటల్‌పై నుంచి కిందికి దూకినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications