కిరాతకం: స్నాక్స్ ఆశచూపి ఏడేళ్ళ బాలికపై అత్యాచారం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకొంది. స్నాక్స్ ఇప్పిస్తానని చెప్పి ఏడేళ్ళ బాలికపై ఓ గుర్తు తెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక తాండూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

వికారాబాద్ జిల్లా వెల్మకన్నె గ్రామానికి చెందిన ఏడేళ్ళ మైనర్ బాలిక 60 ఏళ్ళనానమ్మ వద్దే ఉంటోంది.అయితే ఐదేళ్ళ క్రితం తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె నానమ్మ వద్దే ఉంటోంది.

రెండో తరగతి చదువుతోంది మైనర్ బాలిక. ఆ బాలిక నానమ్మ అనారోగ్యానికి గురైంది.దీంతో బాలికతో కలిసి నానమ్మ తాండూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది.

అయితే ఆమె డాక్టర్ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బాలికకు స్నాక్స్ ఆశచూపి బయటకు తీసుకెళ్ళాడు.

minor gira rape

అయితే బాలిక నానమ్మ మరో రోగికి సహయంగా వచ్చిన వ్యక్తే బాలికకు స్నాక్స్ ఇప్పిస్తానని చెప్పి ఉంటాడని నమ్మి బాలికను అప్పగించింది. అయితే రాత్రి అవుతున్న తన మనమరాలు రాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది.

రాత్రి వరకు ఎదురుచూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే అర్ధరాత్రి పూట తాండూరు బస్ స్టేషన్ లో పారిశుద్య కార్మికులకు ఏడేళ్ళ బాలికతో తిరుగుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కన్పించాడు.

అయితే ఆ వ్యక్తిని పారిశుద్య కార్మికులు ప్రశ్నించారు.అయితే ఆ బాలిక తన కూతురేనని అతను చెప్పాడు. వారి ప్రశ్నలకు అతను బాలికను వదిలేసి వెళ్ళిపోయాడు.

అయితే పోలీసులు బాలికను తాండూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు.బాలికపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు ప్రకటించారు.బస్ స్టేషన్ సమీపంలో ఉన్న సిసిటీవి పుటేజ్ ను పరిశీలిస్తే నిందితుడి వివరాలు దొరికే అవకాశం ఉందని పారిశుద్య కార్మికులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man lured a seven-year-old girl at the Tandur Government Hospital by promising her snacks and then sexually assaulted her. The incident occurred in Vikarabad district on Saturday.
Please Wait while comments are loading...