బర్త్‌డే రోజు విషాదం: పుట్టిన రోజు వేడుకల్లో గన్ పేలి హైదరాబాద్ విద్యార్థి మృతి

ఖండాతరాలు దాటినా.. కుతుహల మాత్రం తగ్గడం లేదు నేటి తరానికి. పెద్ద చదువుల కోసం దేశాలు దాటి వెళ్లినా.. పెద్దగా ఫలితం ఉండటం లేదు. పుట్టిన రోజు వేడుకల పేరుతో ట్రెండింగ్ అంటూ చేస్తున్న వికృత చేష్టలు ప్రాణాలు బలికోరుతున్నాయి. బర్త్ డే - డెత్ డే గా మారుతుంటే కన్న పేగు విలవిలలాడుతుంది.

రీల్స్.. రీల్స్.. రీల్స్.. సమయం, సందర్భం లేకుండా.. ఫాలోవర్స్ కోసం ఒళ్లు మరచి చేసే పనులు కుటుంబీకులను కంటతడి పెట్టిస్తున్నాయి. మంచి చదువులు చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని తమని బాగా చూసుకుంటారు అనుకుంటున్న కన్న వారి కలలు.. కాటికి చేరుతున్నాయి. తమను మోయాల్సిన భుజాలను.. తమ భుజాలపై మోస్తుంటే ఆ భారాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు.. ఈ రోజు ఆ క్షోభను అనుభవిస్తున్నారు... సుదర్శన్‌రెడ్డి దంపతులు.

Hyderabad Student dies after a gun misfires in his birthday celebrations in US

పుట్టిన రోజు నాడు రీల్స్ చేసి .. ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్న ఓ తెలుగు విద్యార్ధికి. అదే అతని చివరి వీడియో అయింది. ఉప్పల్‌ ధర్మపురి కాలనీకి చెందిన సుదర్శన్‌రెడ్డి కుమారుడు ఆర్యన్‌రెడ్డి (23) ఏడాదిన్నర క్రితం మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. జార్జీయాలోని అట్లాంటాలో ఉంటున్నారు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ.. ఎంఎస్ చదువుతున్నారు. ఈ నెల 13న అతని పుట్టిన రోజు. ఈనెల 13న ఆర్యన్‌రెడ్డి.. తన పుట్టినరోజును ఫ్రెండ్స్ తో కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇదే టైం లో గన్ తో కేక్ వెలిగించి.. రీల్స్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు అందరూ.. అయితే ఇక్కడే గన్ మిస్ ఫైర్ అయింది. బులెట్ ఆర్యన్ రెడ్డి శరీరంలోకి దూసుకెళ్లింది. తీవ్రరక్తస్రావం కావడంతో అతను అక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనపై అట్లాంటా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గన్ వారికి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎంత కాలం నుంచి గన్ వాడుతున్నారు అని విచారణ చేస్తున్నారు. గురువారం నాడు ఆర్యన్ రెడ్డి మృతదేహం ఉప్పల్ చేరనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+