అమీర్‌పేట్ మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ అమీర్‌పేట్ మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో కొద్దిసేపటి కిందటే ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ చిక్కుకున్న పలువురిని నిచ్చెనల సహాయంతో సురక్షితంగా కిందికి దించారు.

ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తోన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. భవనంలో దట్టమైన పొగ అలముకోవడంతో విద్యార్థులతో పాటు ఇతర నివాసితులలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. పొగ అంతా వ్యాపించడంతో భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న కంప్యూటర్ శిక్షణా సంస్థలో పలువురు విద్యార్థులు చిక్కుకుపోయారు.

Hyderabad Students Trapped Fire Breaks Out in 4th floor Maitrivanam Nilagiri Block Rescue Underway

ఫైర్ కంట్రోల్ స్టేషన్ కు ఈ ఉదయం సరిగ్గా 10:59 నిమిషాలకు అగ్నిప్రమాద సమాచారం అందింది. వెంటనే మూడు ఫైర్‌టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి-2 అజ్మీరా శ్రీదాస్ వెల్లడించిన వివరాల ప్రకారం జీ+5 భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ ఎలక్ట్రికల్ షాపులో మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

పైఅంతస్తుల్లో చిక్కుకున్న వారిని బాల్కనీల ద్వారా నిచ్చెనలు, ఫేస్ మాస్క్‌లు ఉపయోగించి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ముందు జాగ్రత్త చర్యగా భవనానికి విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేశారు. మంటలు చెలరేగడం వల్ల పలు ఫ్లెక్సీలు కాలిపోయాయి. ఘాటు వాసన ఈ ప్రదేశం అంతా వ్యాప్తిచెందింది. దీంతో ఊపిరి పీల్చుకోవడంతో విద్యార్థులు కొంత ఇబ్బందిపడ్డారు. ఫలితంగా రెస్క్యూ టీమ్ ఫేస్ మాస్క్ లను వినియోగించాల్సి వచ్చింది.

ఈ అగ్నిప్రమాదం కారణంగా అమీర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిప్రమాదం, వాహనాల రద్దీ కారణంగా ఎస్ఆర్ నగర్ రోడ్డు నుండి మైత్రీవనం కూడలి మీదుగా సత్యం థియేటర్ రోడ్డు వైపు వాహనాలు స్తంభించిపోయాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తూనే అత్యవసర సేవలను సమన్వయం చేసుకుంటూ రాకపోకలను నియంత్రిస్తున్నారు.

ప్రయాణికులు ఈ ప్రభావిత ప్రాంతాన్ని నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ అధికారులకు సహకరించాలని కోరారు. క్విక్ రియాక్షన్, ట్రాఫిక్ నియంత్రణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+