హైదరాబాద్.. బెంగళూరును దాటేసింది: సక్సెస్ ఫుల్ స్టేట్ తెలంగాణ అంటూ కేటీఆర్
హైదరాబాద్: ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్‌లో సక్సెస్‌ఫుల్ స్టార్టప్ తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు. ఛాలెంజెస్ ఆఫ్ బీయింగ్ ఏ యంగ్ స్ట్రేట్ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్రం కోసం పోరాడాం. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

దశాబ్దాల పోరాటం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండే. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. శాంతిభద్రతలు ఎలాంటి విఘాతం కలగలేదన్నారు కేటీఆర్.
సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ ప్రతి ఇంటికి తాగునీరు అందించారని కేటీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని కేటీఆర్ వివరించారు.
Minister @KTRBRS presented the Abhay Tripathi Memorial Lecture on ‘Challenges of being a young state’ at MCRHRDI, Hyderabad.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 21, 2023
Abhay Tripathi (1961-2021) was an IAS officer of the 1986 batch of the Andhra Pradesh cadre who served in various key positions in the State government… pic.twitter.com/FGVtgdROgg
కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మిషన్ భగీరథ లాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొడుతున్నాయని కేటీఆర్ చె్పుకొచ్చారు. ఇక,విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చాం. నీతి ఆయోగ్ చెప్పినా మోడీ సర్కార్ తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయన్నారు.ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ తెలిపారు.
Minister @KTRBRS presenting Abhay Tripathi Memorial Lecture on ‘Challenges of being a young state’ at MCRHRDI, Hyderabad. https://t.co/G2E29qzApD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 21, 2023
ఇక ఐటీ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని మంత్రి తెలిపారు. ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసింది. ఐటీ ఉద్యోగులు 9 లక్షల మందికి చేరుకున్నారని తెలిపారు. అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ సెక్టార్ పురోగతితో యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని మంత్రి కేటీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications