సానియా మీర్జాకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా
హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు సానియా కారు నెంబరు ప్లేటు నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తించారు. దీనికిగాను ఆమెకు రూ.200 జరిమానా విధించారు.

సానియాకు చెందిన టొయోటో ఫార్చ్యూనర్ (టిఎస్ 09 ఈజి 1) సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 10లో పార్కింగ్ ప్రదేశంలో ఉంది.
అదే దారిలో వెళుతున్న ఎస్‌ఐ రాఘవరావు కారు నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఫొటో తీసి చలానా విధించారు.












Click it and Unblock the Notifications