హైద్రాబాద్ పోలీస్ సరికొత్త ఐడియా: వర్షం వస్తే ఎలా వెళ్లాలో చెప్తారు
హైదరాబాద్: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో హైదరాబాదులో తలెత్తే వాహనాల రాకపోకల అంతరాయం అంశంపై ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ నగర ప్రజలకు పలు సూచనలు చేశారు.
అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు... ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వర్షం పడితే ఉద్యోగులు ఒక్కసారిగా కార్యాలయాలు వదిలి బయటకు రావొద్దని ట్రాఫిక్ డీసీపీ విజ్ఞప్తి చేశారు.

కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై వచ్చి చేరుతుండటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ పైన ఎప్పటికప్పుడు సామాజిక మాద్యమం ద్వారా సూచనలు ఇస్తామన్నారు.
ఆ ప్రకారం వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరారు. గత నెలలో, అలాగే ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో సాయంత్రం సమయంలో కుండపోతగా వర్షం పడి జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications