కేబీఆర్ పార్క్ వైపు వెళ్లేవారికి ముఖ్య గమనిక

హైదరాబాద్‌ లో అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్‌ చుట్టూ ప్రయాణించే వాహనదారులకు ముఖ్యగమనిక. ఆదివారం నాటి తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక బద్ధంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వంతెనల నిర్మాణ పనుల కారణంగా నగర ట్రాఫిక్ పోలీసులు వన్‌వే నిబంధనలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 10 గంటల పాటు ఈ తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా జుబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధుల్లో స్టీల్ ఫ్లైఓవర్‌తో పాటు అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు ఈ రెండో విడత వన్‌వే ట్రయల్ రన్‌ను చేపట్టారు.

Hyderabad Traffic Police Launch One-Way Trial Around KBR Park on Sunday for Steel Flyover Work

ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే..

ఎన్‌ఎఫ్‌సీఎల్ (NFCL) జంక్షన్ నుంచి ఎస్‌ఎన్‌టీ, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 36, రోడ్ నంబర్ 45 తో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించారు. ఈ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ భవన్ మార్గం ద్వారా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అగ్రసేన్ ఐలాండ్, ఒమేగా హాస్పిటల్, భారతీయ విద్యాభవన్ మీదుగా మళ్లిస్తారు. ఈ నిర్ణీత మార్గాల్లో ప్రయాణించే వారికి ఎక్కడా యూటర్న్‌లకు అనుమతి లేదు. ఎడమ వైపు లేన్లలోనే వెళ్ళాల్సి ఉంటుంది.

యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, 45 లేదా మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారుల కోసం రెండు విభిన్న ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. మొదటిది.. ఇందిరానగర్ రోడ్డు, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, అల్కాజార్ మీదుగా రోడ్ నంబర్ 36, 45 వైపు వెళ్లాల్సి ఉంటుంది.

రెండోది.. అన్నపూర్ణ స్టూడియోస్ బైలేన్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, ఫిలింనగర్, సేనోర్ వ్యాలీ మీదుగా షేక్‌పేట్ వైపు ప్రయాణించవచ్చు.

కేబుల్ బ్రిడ్జ్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు..

మరోవైపు ఐటీసీ కోహినూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనదారులు రోడ్ నంబర్ 60, 67 మీదుగా నిర్దేశిత మార్గాల్లో వెళ్లాలి. అనంతరం రోడ్ నంబర్ 1 ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ వన్‌వే ట్రయల్ రన్ సమయంలో వాహనదారులు నిబంధనలు పూర్తిగా పాటిస్తూ ఎడమ వైపు లేన్లనే ఎగ్జిట్ల కోసం ఉపయోగించాలని, లేదంటే ట్రాఫిక్ నిలిచిపోయే ప్రమాదముందని పోలీసులు హెచ్చరించారు.

ప్రయాణ మార్లాలను ముందే గమనించడానికి గూగుల్ మ్యాప్స్ లాంటి లైవ్ నావిగేషన్ యాప్‌లను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సలహా ఇచ్చారు. ప్రయాణికులు విధిగా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, ఏదైనా అత్యవసర సమయంలో లేదా తక్షణ సహాయం అవసరమైతే వాహనదారులు తప్పకుండా అధికారిక ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+