తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఎప్పుడంటే?

వచ్చే వర్షాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం కంటే అధిక వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదువుతుందని తెలిపింది.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంపై హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాలు వెల్లడించింది. జూన్-సెప్టెంబర్ నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఎల్ నినో పరిస్థితులు జూన్ నాటికి పూర్తిగా బలహీన పడతాయి. లా నినా పరిస్థితులు జులైలో పుంచుకుంటాయి.

hyderabad weather department statement on entry of southwest monsoon in telangana

ఈ నేపథ్యంలోనే నైరుతి రుతుపవనాలు జూన్ 8, 11వ తేదీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భావిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయి. ఆగస్టులో సాధారణ రీతిలో కొనసాగుతూ.. తిరిగి సెప్టెంబర్‌లో అధికంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది.

గత ఏడాది రుతపనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదుకావడంతో సాగుకు విఘాతం కలిగింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండుకుని క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ఏడాది మాత్రం అలా ఉండదని, వానలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+