హైదరాబాద్ కు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్- రూట్ ఇదే
Amrit Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

అదే సమయంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న అమృత్ అమృత భారత్ రైళ్ల జాబితాను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అయిదు రూట్లల్లో ఈ కొత్త ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
1. గయాజీ- ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
2. ఛాప్రా- ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
3. ముజఫర్‌పూర్- హైదరాబాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
4. సహర్సా- అమృత్‌సర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
5. వైశాలి- కోడెర్మా (బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్)
6. పాట్నా- పూర్నియా (వందే భారత్ ఎక్స్‌ప్రెస్)
ఆయా రైళ్లను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. గయాజీలో ఆయన పర్యటించనున్నారు. బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో రైల్వే శాఖ ఆ రాష్ట్రానికి ఓ వందే భారత్, నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లను కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీపావళి, ఛాత్ పండుగల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పండుగ సీజన్ లో ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనడానికి 12,000కు పైగా ప్రత్యేక రైళ్లను దేశవ్యాప్తంగా నడిపించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పాట్నాలో రింగ్ రైల్వే నెట్‌వర్క్ కూడా నిర్మంచనున్నట్లు చెప్పారు.
ముజఫర్‌పూర్- హైదరాబాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఖాజీపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, నాగ్ పూర్, గోండియా, దుర్గ్, రాయ్ పూర్, బిలాస్ పూర్, ఝార్సుగూడ, రూర్కేలా, హాతియా, రాంచీ, బొకారో, పరస్ నాథ్, కోడెర్మా, గయాజీ, జెహనాబాద్ మీదుగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications