మూడో పెళ్ళిచేసుకొన్న ఏడాదికే, చిచ్చు పెట్టిన ఫోన్ కాల్, చివరికిలా...
ఓ పోన్ కాల్ భార్య, భర్తల ప్రాణాలను తీసింది. అనుమానంతో భర్తకు మరో స్త్రీ తో వివాహేతర సంబంధం ఉందని భావించిన భార్య కిరోసిన్ పోసుకొని నిప్పటించింది.అంతేకాదు తాను కూడ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంది.
హైదరాబాద్:ఓ ఫోన్ కాల్ భార్య,భర్తల ప్రాణాలను తీసింది. అనుమానంతో భార్య,భర్తలు గొడవపడి చివరకు ప్రాణాలు తీసుకొన్నారు.భర్తపై అనుమానంతో భార్య కిరోసిన్ పోసి చంపింది, మరో వైపు తాను కూడ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన వికారాబాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.
బర్లపల్లి జంగయ్య భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అంగడి చింతపల్లి గ్రామానికి చెందినవాడు. ఏడాది క్రితం ఆయన సావిత్రి అనే మహిళను వివాహం చేసుకొన్నాడు.
వీరిద్దరికి కూడ మూడోసారి వివాహం చేసుకొన్నారు. జంగయ్యకు ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మరణించారు.దీంతో సావిత్రిని ఏడాదిక్రితం మూడో వివాహం చేసుకొన్నాడు.సావిత్రి కూడ ఇదివరకే రెండు వివాహలయ్యాయి.అయితే ఆమె తన భర్తలతో దూరంగానే ఉంటోంది.దీంతో ఆమెను మూడో వివాహం చేసుకొన్నాడు జంగయ్య.

సావిత్రి కూడ జంగయ్యతోనే భవన నిర్మాణకార్మికురాలిగా పనిచేస్తోంది. సావిత్రికి రెండో భర్తతో పుట్టిన కూతురును తీసుకొని జంగయ్యతో నివాసం ఉంటుంది. ఆ కూతురుకు 17 ఏళ్ళ వయస్సు.అయితే ఆమె మానసిక సరిగా లేదు.
సావిత్రి,జంగయ్య దంపతులకు మూడు మాసాల క్రితమే కొడుకు పుట్టాడు. అయితే శనివారం రాత్రి పూట మద్యం తాగి వచ్చిన జంగయ్య నిద్రపోయే సమయానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఈ ఫోన్ కాలే వారి కుటుంబంలో చిచ్చుపెట్టింది. జంగయ్యకు వచ్చిన పోన్ కాల్ లో ఓ మహిళ మాట్లాడింది.అయితే ఈ ఫోన్ ను జంగయ్య ఇంటి బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు.
అయితే ఫోన్ ఎవరు చేశారంటూ భార్య సావిత్రి భర్త జంగయ్యను నిలదీసింది.ఈ విషయమై భార్య, భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది.
సుమారు గంటపాటు ఇద్దరూ కూడ గొడవపడ్డారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని భార్య సావిత్రి అనుమానించింది. గంట తర్వాత భర్త నిద్రపోగానే కిరోసిన్ పోసి నిప్పంటించింది భార్య సావిత్రి. మంటలకు తాళలేక రక్షించండంటూ ఇంటి నుండి వరండా బయటకు వచ్చి జంగయ్య పడిపోయాడు.
మరో వైపు జంగయ్య చనిపోయాడని భావించిన సావిత్రి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది. ఈ అరుపులు విన్న పక్కింట్లోనే నివాసం ఉండే సావిత్రి సోదరుడు వారిద్దరిని కూడ ఆసుపత్రికి తరలించారు.
ఈ దంపతులు 90 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహలను కుటుంబసభ్యులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications