ఇదేమిటని ప్రశ్నిస్తే: అతని మీద నడిరోడ్డుపై యువతి ఊగిపోయింది (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బేగంపేటలో ఓ యువతి నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. మితిమీరిన వేగంతో రోడ్డుపై మిగతా వాహనదారులను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

నడిరోడ్డుపై యువతి రచ్చ: బండబూతులతో విరుచుకుపడింది..

అడ్డువచ్చిన వాహనాన్ని ఢీకొంటూ

అడ్డువచ్చిన వాహనాన్ని ఢీకొంటూ

గురువారం మధ్యాహ్న ఆ యువతి కారులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తోంది. అడ్డు వచ్చిన ఒకటి రెండు వాహనాలను ఢీకొంటూ ముందుకు సాగింది. కారు ఢీకొన్న వాహనదారులు వెంబడించి ఆ యువతిని ప్రశ్నించారు.

అడిగితే యువతి వాగ్వాదం

అడిగితే యువతి వాగ్వాదం

వాహనదారులు ప్రశ్నించగా ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు తనను ప్రశ్నించిన వారిపై దాడికి ప్రయత్నించింది.

ఆ యువతి ఎవరంటే

ఆ యువతి ఎవరంటే

ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని సిక్ విలేజ్‌కు చెందిన లుబ్నా అనే యువతి మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపుకు ఓక్స్ వాగన్ కారులో వెళ్తోంది.

బైక్‌ను ఢీకొట్టడంతో

బైక్‌ను ఢీకొట్టడంతో

కారు బేగంపేట ప్రాంతానికి వచ్చాక అక్కడ తమ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనదారులు ఆమె కారును ఆపి, నిలదీశారు. దీంతో దాడికి ప్రయత్నించింది.

ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా

ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా

అటుగా వెళ్తున్న ఎస్సార్ నగర్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ రామలింగరాజు ఆ యువతికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువతి పోలీసు మాటలు పట్టించుకోకుండా అతనిపై దాడికి యత్నించింది.

సీసీటీవీలో నిక్షిప్తం

సీసీటీవీలో నిక్షిప్తం

ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. అంతేకాదు, అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వాహనదారుడి ఫిర్యాదుతో

వాహనదారుడి ఫిర్యాదుతో

కారు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైన హరీష్ అనే వాహనదారుడు ట్విట్టర్‌లో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనరేట్ నుంచి ఫిర్యాదు బేగంపేట పోలీసులకు చేరింది. దీంతో యువతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The video of a woman creating a ruckus in Hyderabad's busy Begumpet - Secunderabad road on Thursday, where she is seen abusing and trying to hit fellow commuters, has gone viral.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి