ఐదుగురు మహిళా బంగారం చోరుల పట్టివేత

హైదరాబాద్: నకిలీ బంగారాన్ని ఎరగా వేసి వృద్ధ మహిళలను నమ్మించి మోసగిస్తూ బంగారం దోచుకుంటున్న ఐదుగురు మహిళలను హైదరాబాదులోని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. నగరం, శివార్లలో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వేముల సమ్మక్క ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 6 లక్షల విలువైన 22 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌ సీసీఎస్‌ బృందం సహకారంతో కేపీహెచ్‌బీ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

కూకట్‌పల్లి ఏసీపీ సాయి మనోహర్‌ శుక్రవారం కేపీహెచ్‌బీ సీఐ శ్రీకాంత్‌గౌడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా చోరుల ముఠా వివరాలను వెల్లడించారు. వేముల సమ్మక్క (38), బండారి అనిత (30), కొమెరి అంజలి (40), కొమెరి లక్ష్మి (35), దేరంగుల భూలక్ష్మి (40)ని పోలీసులు శుక్రవారం నిజాంపేట బస్టాప్‌ వద్ద అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలువురి దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు దోచుకున్న తీరు గురించి వివరించారు.

ఈ ఐదుగురితో పాటు బి.వెంకటేశ్వర్‌ (35), దేరంగుల శ్రీనివాసరావు (40), గుడ్డి రాములమ్మ కలిసి ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా సభ్యులు ఒంటరిగా వెళుతున్న వృద్ధ మహిళలను నమ్మించి మోసం చేస్తారు. పథకం ప్రకారం నకిలీ బంగారు ఆభరణాలతో నింపిన పర్సుని రోడ్డు మీద పడేస్తారు. ఒంటరిగా వస్తున్న మహిళలు ఆ పర్సుని తీసుకుని చూస్తుండగానే ముఠాలోని ఒకరిద్దరు మహిళలు ఆమెను చుట్టుముడతారు. బంగారు ఆభరణాలున్న పర్సుని తాము ముందు చూశామంటే తాము చూశామని వారిలో వారు గొడవ మొదలుపెడతారు.

Hyderabad: women theives arrested

ఇదంతా జరుగుతుండగానే ముఠాలోని ఒక సభ్యుడు వారి వద్దకు వచ్చి ఏమీ తెలియనట్టు ఏం జరిగిందని ఆరా తీస్తాడు. వారు విషయం చెప్పిన తర్వాత దొరికిన బంగారాన్ని అందరూ పంచుకోవాలని, లేదంటే పోలీసులు స్వాధీనం చేసుకుంటారని ఉచిత సలహా ఇస్తారు. అమాయక మహిళలు తమ వలలో పడ్డారని గమనించిన తర్వాత పర్సులో ఉన్న ఎక్కువ బంగారం వారినే తీసుకోమని, వారి మెడలోని బంగారు ఆభరణాలను తమకు ఇస్తే సరిపోతుందని బేరం పెడతారు.

ఆ రకంగా ఈ ముఠా సభ్యులు ఇప్పటి వరకు కేపీహెచ్‌బీ, ఎల్‌బీనగర్‌, అల్వాల్‌, వనస్థలిపురం, దుండిగల్‌, మాదాపూర్‌, నార్సింగి, పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో పది మంది మహిళలను మోసగించి బంగారు ఆభరణాలు దోచుకుని తప్పించుకు తిరుగుతున్నారు. ఐదుగురు మహిళలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు పరారీ ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+