హైదరాబాద్ జూపార్క్ లోకి వింత జంతువులు.. సడెన్ గా పెరిగిన పర్యటకులు..!

రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాల్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటి. నిత్యం ఈ పార్క్ కు వందల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. ఇక సెలవు రోజుల్లో అయితే ఆ సంఖ్య రెట్టింపు అవుతుంది. జూపార్క్ లోని రకరకాల పక్షులు, జంతువులను చూసేందుకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా నిత్యం పర్యటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ప్రాంతం. అయితే నెహ్రూ జూపార్క్ లోకి కొత్త జంతువులు రానున్నాయి. జంతు ప్రేమికులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.

ఇక త్వరలో జూపార్క్ లోకి రానున్న ఈ కొత్త జంతువులు పర్యటకులను విశేషంగా ఆకర్షించనున్నాయి. కొత్త జంతువుల్లో కంగారూలు, వాలాబీలు, రింగ్ టెయిల్డ్ లెమూర్లు, కాసోవరీలు అంటే ఎగరలేని పక్షులతోపాటు జీబ్రాలను కూడా తీసుకురానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఈ జంతువులను గుజరాత్ జామ్ నగర్ లోని వంతారా అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి తరలించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు స్పష్టం అవుతోంది.

హైదరాబాద్ జూపార్క్ లో ఇప్పటివరకూ కంగారూలు లేవనే చెప్పాలి. ఈ క్రమంలో తొలిసారిగా ఒక జంట ఆడ, మగ కంగారూలను తీసుకురానున్నారు అధికారులు. ఇక ఈ కంగారూల కోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్, నైట్ హౌజ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక వంతారా అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి వచ్చిన నిపుణులు ఇప్పటికే హైదరాబాద్ జూపార్క్ లో వసతులను పరిశీలించినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే కంగారూలు రానున్నాయి. అయితే 2020 లో జపాన్ లోని ఓ జూపార్క్ నుంచి కంగారూలను తీసుకురావాలని ఒప్పందం కుదిరినా అదే సమయంలో కొవిడ్-19 విజృంభణ కారణంగా అది సాధ్యపడలేదని తెలుస్తోంది.

Hyderabad Zoo Kangaroos wallabies and ring tailed lemurs will soon be arriving at the Hyderabad Zoo

కంగారూలతో పాటు వాలాబీలు కూడా హైదరాబాద్ జూపార్క్ లో సందడి చేయనున్నాయి. వీటితోపాటు మడగాస్కర్ కు చెందిన రింగ్ టెయిల్డ్ లెమూర్లు కూడా హైదరాబాద్ జూపార్క్ లోకి రానున్నాయి. అలాగే ప్రస్తుతం జూపార్క్ లో మూడు జీబ్రాలు ఉండగా.. వంతారా నుంచి మరో జంట జీబ్రాలు కూడా రానున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక నెహ్రూ జూలాజికల్ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని బహదూర్‌ పురాలో ఉంది. ఈ పార్కు దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జూపార్కును ప్రతి సోమవారం మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక టికెట్ ఫీజు విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్దలకు అంటే 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వారకి రూ. 100 ఉంది. అలాగే పిల్లలకు అంటే 3 నుంచి 12 సంవత్సరాల వారికి రూ. 50 గా ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+