పాముల రహస్య ప్రపంచం.. హైదరాబాద్ జూపార్క్‌లో ప్రత్యక్షంగా

హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్ లో 72వ వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఓ ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో భాగంగా సందర్శకులకు పాములపై పూర్తి స్థాయిలో శాస్త్రీయ అవగాహన కల్పించారు. క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. జూ ఆవరణలో పండుగ వాతావరణంలో వేలాది మంది ప్రకృతి ప్రేమికుల మధ్య ఆయా కార్యక్రమాలను జూపార్క్ అధికారులు చేపట్టారు.

వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం పట్ల సమాజంలో విస్తృతమైన చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయా కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే 5,000 నుంచి 6,000 మందికి పైగా పైగా సందర్శకులు జూపార్క్ ను సందర్శించారు. ఈ ప్రత్యక్ష ప్రదర్శనలను తిలకించారు. పాముల పట్ల సాధారణ ప్రజానీకంలో నెలకొన్న అనవసర భయాలను తొలగించడానికి, పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్రను వివరించడానికి ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్లు దోహదపడ్డాయి.

Hyderabad Zoo Par Hosts Snake Awareness Show and Cloud Photography Exhibition Wildlife Week Celebrations

ఈ సందర్భంగా జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సీహెచ్ దీపక్ తరుణ్ పాల్గొన్నారు. పాముల జీవన విధానంపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సందర్శకులకు వివరించారు. పాముల పట్ల ఉన్న మూఢనమ్మకాలు, నిరాధారమైన అపోహలను ఆయన శాస్త్రీయ ఆధారాలతో అవగాహన కల్పించారు. పాముల్లో కొన్ని మాత్రమే విషపూరితమైనవని, మిగిలినవన్నీ పూర్తిగా విషరహితమైనవని పేర్కొన్నారు. కింగ్ కోబ్రా, రక్తపింజరి, కట్లపాము.. వంటి జాతులు మాత్రమే అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైనవని ఆయన తెలిపారు.

రష్యాలో ప్రమాదకర ప్లేగ్.. అవుట్ బ్రేక్: మధ్యయుగం నాటి మహమ్మారి: అమెరికా సైతం ఆరా
రష్యాలో ప్రమాదకర ప్లేగ్.. అవుట్ బ్రేక్: మధ్యయుగం నాటి మహమ్మారి: అమెరికా సైతం ఆరా

80 శాతానికి పైగా పాములు విషరహితమైనవని, అవి మనుషులకు ఎటువంటి హాని తలపెట్టబోవని దీపక్ తరుణ్ పేర్కొన్నారు. సాధారణంగా పొలాల్లో కనిపించే ర్యాట్ స్నేక్, శాండ్ బోవా, గ్రీన్ వైన్.. వంటి రకాలు పంటలను తీవ్రంగా నాశనం చేసే ఎలుకలు, కప్పలు, కీటకాలు, చిన్న క్షీరదాలను తిని బతుకుతాయని అన్నారు. ఈ విధంగా ఈ పాములు పంటలను కాపాడటంలో రైతులకు సహాయం చేస్తాయని, వాటిని 'రైతు మిత్రులుగా పరిగణించాలని సూచించారు.

ఈ విషయాన్ని టీటీడీ పునరాలోచించాలి.. అప్పుడే తుది నిర్ణయం
ఈ విషయాన్ని టీటీడీ పునరాలోచించాలి.. అప్పుడే తుది నిర్ణయం

అనంతరం జూపార్క్ క్యూరేటర్ వసంత మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రకృతిలోని ప్రతి జీవికి ఓ ప్రాధాన్యత స్థానం ఉంటుందని తెలిపారు. ఈ వన్యప్రాణి పర్యావరణ వ్యవస్థలో ఫుడ్ సైకిల్ ను క్రమబద్ధీకరించడానికి పాములు సహాయపడతాయని వివరించారు. దురదృష్టవశాత్తూ పాములపై దశాబ్దాలుగా ఉన్న పేరుకుపోయిన అపోహల వల్ల అవి కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రీయ అవగాహన కల్పించడం ద్వారానే పాములు, ఇతర వణ్యప్రాణులను కాపాడగలమని చెప్పారు. రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం వన్యప్రాణుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+