ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ స్థాయి గుర్తింపు: 100 అత్యుత్తమ వంటకాల్లో టాప్

Hyderabad Biryani: తెలుగువాళ్లు సహజంగానే భోజన ప్రియులు. నోరూరించే ఎలాంటి వంటకాలనైనా స్వాహా చేసేస్తారు. ఇక బిర్యానీ పేరెత్తితే దాన్ని రుచి చూడందే వదల్లేరు. మాంసాహారం అంటే మరీనూ. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ..చివరికి ఎగ్ బిర్యానీని కూడా ఇష్టంగా తింటారు.

హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లెవరూ ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేయకుండా సిటీని వదిలి వెళ్లలేరు కూడా. హైదరాబాద్‌ను సందర్శించడానికి వచ్చిన పొరుగు రాష్ట్రాల వాళ్లు బిర్యానీని తినడాన్ని గొప్పగా చెప్పుకొనే సందర్భాలు చాలానే ఉన్నాయి. బిర్యానీ తయారీ విధానం, రెసిపీ, అందులో వినియోగించే మసాలా దినుసుల క్వాలిటీ వల్లే ఆ గొప్పదనం అబ్బింది.

Hyderabadi Biryani among the 100 Best Dishes in the World by the Taste of Atlas

అలాంటి హైదరాబాద్ బిర్యానీ స్థాయి మరింత పెరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్‌కు చేరింది. టేస్ట్ అట్లాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద అత్యుత్తమ వంటకాల్లో ఈ బిర్యానీకి చోటు లభించింది. దీని స్థానం.. 31. మరో మూడు భారతీయ వంటకాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

క్రొయేషియాకు చెందిన సంస్థ టేస్ట్ అట్లాస్. క్రొయేషియన్ జర్నలిస్ట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ మటీజా బబిక్ 2015లో దీన్ని నెలకొల్పారు. ట్రావెల్ ఎంథూసియాసిస్ట్స్, ఫుడీస్ కోసం ఇది పని చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వంద అత్యుత్తమ వంటకాలపై ఈ సంస్థ ఫుడీస్ నుంచి అభిప్రాయాలను సేకరించింది.

11,258 ఫుడ్ ఐటమ్స్‌పై మొత్తంగా 3,67,847 మంది నుంచి రేటింగ్స్ తీసుకుంది. దీన్ని క్రోడీకరించి 100 అత్యుత్తమ వంటకాల జాబితాను రూపొందించింది టేస్ట్ అట్లాస్. ఇందులో హైదరాబాద్ బిర్యానీకి 4.52 రేటింగ్ లభించింది. 31వ స్థానంలో నిలిచింది. ఇదే జాబితాలో మరో భారతీయ వంటకం ముర్గ్ మఖనీకి 29వ స్థానం లభించింది. తొలి 10 స్థానాల్లో లెచొనా, పిజ్జా నపొలెటానా, పికన్హా, రెక్టా, ఫనాయెంగ్ కర్రీ, అసడొ, కోకెర్ట్‌మె కెబాబి, రవొన్, కాగ్ కెబాబి, టిబ్స్ నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+