హైదరాబాద్ బిర్యానీకి పాక్ ఆటగాళ్లు ఫిదా: కరాచీ బిర్యానీతో పోల్చి, ఎంత రేటింగ్ ఇచ్చారంటే?

హైదరాబాద్: హైదరాబాద్ బిర్యానీ అంటే మనదేశంలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. దీన్ని టేస్ట్ చేసిన వారెవరైనా.. వాహ్ వా అనాల్సిందే. తాజాగా, ఇటీవల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ కోసం హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా హైదరాబాద్ బిర్యానీని లొట్టలేసుకుంటూ ఆరగించారు. అంతేగాక, హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు.

ఇటీవల హైదరాబాద్ బిర్యానీని ఆరగించారు పాకిస్థాన్ ఆటగాళ్లు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో పాక్ క్రికెటర్లను హైదరాబాద్ బిర్యానీ, కరాచీ బిర్యానీల్లో ఏది బాగుంది అని ప్రశ్నించారు. హైదరాబాద్ బిర్యానీకి ఎంత రేటింగ్ ఇస్తారని అడిగారు. హైదరాబాద్ కొంచెం స్పైసీగా ఉందని.. ఇది దాని ప్రత్యేకత అని అన్నారు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్. పదికి 8 మార్కులు ఇచ్చాడు.

Hyderabadi biryani vs Karachi biryani: Pakistan cricketers pick their favourite, gives rating

పేస్ బౌలర్ హసన్ అలీ 10/10 రేటింగ్ ఇవ్వగా.. బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్.. అద్భుత్వంగా ఉందంటూ.. హైదరాబాద్ బిర్యానీకి పది 11 మార్కులు ఇస్తానని చెప్పాడు. రెండు బిర్యానీల మధ్య తేడా ఏంటని ప్రశ్నించగా.. బాబర్ ఆజామ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ బిర్యానీ కాస్త స్పైసీగా ఉందన్నాడు. బుధవారం జరిగిన వరల్డ్ కప్ 2023 కెప్టెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉందని మరోసారి అడగ్గా.. హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందని ఎప్పట్నుంచో విన్నాను.. ఇప్పుడు టేస్ట్ చేశాను. చాలా బాగుందని పాక్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

రెండు బిర్యానీలు బాగున్నాయని ఇమామ్ ఉల్ హక్ తెలిపాడు. కాగా, దాదాపు ఏడేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన పాక్ ఆటగాళ్లకు ఇక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఉంటూ ఇక్కడి పద్ధతులతోపాటు ఆహారాలను ఆస్వాదిస్తున్నారు.

ఇక క్రికెట్ విషయానికొస్తే.. ఇప్పటికే పాక్ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ లు పూర్తి చేసింది. అసలైన ప్రపంచ కప్ టోర్నీలో అక్టోబర్ 6న నెదర్లాండ్స్ తో, అక్టోబర్ 10న శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది. అక్టోబర్ 14న అహ్మాదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ మధ్య మ్యాచ్ జగరనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+