టీవిలో చూశాం.. ఎక్కడున్నాడో చెప్పండి?: డేరా ఆశ్రమంలో హైదరాబాదీ యువకుడు..
కుమారున్ని కలుసుకునేందుకు గురువారం సిర్సాలో ఉన్న డేరా ఆశ్రమానికి వారు చేరుకున్నారు.
హైదరాబాద్: సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా బాబాకు 20ఏళ్లు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. డేరా సచ్చా సౌదా ఆశ్రమాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అడుగడుగు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అస్థిపంజరాలు సైతం బయటపడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకును డేరా ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించామని హైదరాబాద్ కు చెందిన దంపతులు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 2009నుంచి తమ కొడుకు షాబాద్ కనిపించకుండా పోయాడని, ఇటీవల డేరా బాబా భక్తులు సృష్టించిన అల్లర్లలో అతను కనిపించాడని వారు చెబుతున్నారు.

కుమారున్ని కలుసుకునేందుకు గురువారం సిర్సాలో ఉన్న డేరా ఆశ్రమానికి వారు చేరుకున్నారు. తమ కుమారుడిని టీవీలో చూశామని, ఎవరికైనా తన ఆచూకీ తెలిస్తే చెప్పాలని అక్కడున్నవారిని వేడుకున్నారు.












Click it and Unblock the Notifications