చలి గుప్పిట్లో హైదరాబాద్.. మరో నాలుగు రోజులు.. ఐఎండీ అంచనా
హైదరాబాద్ లో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. దీని ఫలితంగా చలి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. అంతేకాక డిసెంబర్ 9 నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
దిత్వా తుఫాన్ ప్రభావం తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న 2-3 రోజుల్లో చలి తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో.. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక డిసెంబర్ 9 నుంచి మళ్లీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రత స్థాయిలు మరింత క్షీణించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తుండటంతో ఇప్పటికే ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.












Click it and Unblock the Notifications