Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్తరకం మల్టీప్లెక్స్‌లు! ఫీచర్స్ వింటే ఫిదా అవుతారు!

మనమంతా సినిమా లవర్స్. సినిమాను సినిమా కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. ఒక ఎమోషన్ బిల్డ్ చేసేసుకున్నాం కూడా. మన హీరోను ఒక్క మాట పడనివ్వం, రికార్డులు బ్రేక్ చేయనిదే నిద్రపోం. మరి ఇంతలా సీనిమాపై పిచ్చి పెంచుకున్న మనల్ని మరింత పిచ్చేక్కించేలా చేయబోతున్నాయి కొత్తగా రాబోతున్న థియేటర్లు. ఇప్పటికే 4కే, ఐమాక్స్ బిగ్ స్రీన్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లకే ఫిదా అవుతున్న మనం త్వరలో మన కళ్ల ముందు ఆవిష్కృతం కాబోతున్న బిగ్ ఫీచర్ల గురించి తెలుకుందాం..

భారీగా పెరిగిపోతున్న సినిమా ప్రేమికుల కోసం థియేటర్ల రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సరిపోతాయనుకున్న సాధారణ స్క్రీన్లు ఇప్పుడు సరిపోవడం లేదు. ఈ మార్పుకు తాజా ఉదాహరణగా గడిచిన అతి కొద్ది రోజుల్లో వచ్చిన కొత్త థియేటర్స్, వీటితో పాటుగా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న థియేటర్స్. ఫిల్మ్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డాల్బీ సినిమా (Dolby Cinema) ఎక్స్‌పీరియన్స్ కోసం. కోకాపేటలో నిర్మాత అల్లు అరవింద్.. అల్లు సినిమాస్ త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది. 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్, డాల్బీ విజన్ అందించే అత్యద్భుతమైన కలర్ డెప్త్, డాల్బీ అట్మోస్ ద్వారా చుట్టుముట్టే సౌండ్ - ఇవన్నీ కలిస్తే ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాననే భావన మరిచి, కథలోకి వెళ్లిపోవాల్సిందే. ఇది హైదరాబాద్‌లో థియేటర్ అనుభూతికి ఓ కొత్త బెంచ్‌మార్క్‌గా మారనుంది.

Hyderabad s Cinema Revolution From Regular Screens to Dolby Cinema Superplex amp amp Epic Experiences

ఏషియన్ సినిమాస్

మల్టీప్లెక్స్ రంగంలో మరో బలమైన శక్తిగా ఎదుగుతున్నది ఏషియన్ సినిమాస్. మహేష్ బాబు భాగస్వామ్యంతో వచ్చిన ఏఎంబీ (AMB) సినిమాస్, అల్లు అర్జున్‌తో కలిసి రూపొందించిన AAA సినిమాస్ ఇప్పటికే ఐకానిక్‌గా మారాయి. తాజాగా వనస్థలిపురంలో రవితేజ భాగస్వామ్యంతో ప్రారంభమైన ART సినిమాస్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ లభిస్తున్న ప్రీమియం లార్జ్ ఫార్మాట్ 'EPIQ' స్క్రీన్ సినిమాను మరింత గాఢంగా అనుభూతి చెందేలా చేస్తోంది. ఇక 2026 జూన్ నాటికి, మాస్ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో AMB Classic పేరుతో కొత్త మల్టీప్లెక్స్‌ను తీసుకురావాలన్న ప్లాన్ ఈ రంగంలో మరో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఎఫెక్ట్స్ ఇచ్చే 4DX స్క్రీన్లు

మరోవైపు, దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ సంస్కృతిని నడిపిస్తున్న PVR INOX కూడా హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇనార్బిట్ మాల్‌లో ఉన్న పాత ఆరు స్క్రీన్ల థియేటర్‌ను పూర్తిగా మార్చి, పదకొండు స్క్రీన్ల భారీ సూపర్‌ప్లెక్స్ గా రూపొందించింది. ఇక్కడ 55 అడుగుల వెడల్పు గల PXL (Premium Extra Large) స్క్రీన్‌తో పాటు, గాలి, పొగమంచు, సువాసన వంటి ప్రత్యేక ఎఫెక్ట్స్ ఇచ్చే 4DX స్క్రీన్లు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో కూకట్‌పల్లి, ఎల్బీనగర్, బండ్లగూడ, అలాగే RTC ఎక్స్ రోడ్స్‌లోని ఓడియన్ మాల్‌లో కొత్త PVR ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి.

ప్రసాద్ అంటే ఎమోషన్..

హైదరాబాద్ థియేటర్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌.ఇందులోని PCX స్క్రీన్ 101.6 అడుగుల వెడల్పుతో ఇప్పటికీ దేశంలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా నిలిచింది. పెద్ద సినిమాలకు ప్రేక్షకులు ఎందుకు తరలివస్తారో ప్రతిసారీ నిరూపిస్తోంది. ఇదే విధంగా, లగ్జరీని కోరుకునే ప్రేక్షకుల కోసం PVR అందించే Luxe ఫార్మాట్ కూడా ప్రత్యేకమైన సీటింగ్, క్యూరేటెడ్ మెనూతో థియేటర్ అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్తోంది.

మొత్తంగా చూస్తే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంత వేగంగా పెరుగుతున్నా, థియేటర్ల క్రేజ్ మాత్రం హైదరాబాద్‌లో తగ్గడం లేదు. ఇంట్లో కూర్చుని సినిమా చూడటం ఒక ఆప్షన్ అయితే, పెద్ద స్క్రీన్ ముందు కూర్చుని చప్పట్ల మధ్య, సౌండ్‌లో మునిగి, విజువల్స్‌లో మరిచిపోవడం మరో అనుభూతి. అదే హైదరాబాద్ ప్రేక్షకులను ఇప్పటికీ థియేటర్ల వైపు లాగుతోంది.

అందుకే నిర్మాతలు, థియేటర్ యజమానులు ఇప్పుడు కేవలం స్క్రీన్ మీదే కాదు - సౌండ్ టెక్నాలజీ, కంఫర్టబుల్ సీటింగ్, ఫుడ్ క్వాలిటీ, సేఫ్టీ ప్రమాణాలు, మొత్తం వాతావరణం మీద దృష్టి పెడుతున్నారు. సినిమా అంటే రెండు గంటల వినోదం మాత్రమే కాదు... భావోద్వేగం కూడా అన్న భావన హైదరాబాద్‌లో మరింత బలంగా నాటుకుపోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+