హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ - నో కాంప్రమైజ్..!!

హైడ్రా తరువాతి గురి ఎక్కడ. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తో ఇప్పుడు హైడ్రా కార్యాచరణ పైన ఉత్కంఠ పెరుగుతోంది. పలువురు రాజకీయ నేతల కట్టడాల పైన చర్చ జరుగుతోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్యులకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో, హైడ్రా తరువాతి కూల్చే నిర్మాణాల పైన చర్చ మొదలైంది. ఇందులో కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతల నిర్మాణాలు లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నెక్స్ టార్గెట్
హైడ్రా ఎక్కడా రాజకీయంగా విమర్శలకు..ప్రజల్లో ప్రతికూలత రాకుండా హైడ్రా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా సామర్ధ్యం గురించి చర్చ మొదలైంది. భారీ సంఖ్యలో ఆక్రమణలు..అనుమతులు లేని నిర్మాణాల పైన హైడ్రా ఆధారాలు సేకరించింది. అయితే, న్యాయపరంగానూ అన్ని అంశాలను పరిశీలన చేస్తోంది. ఇక ఇప్పుడు లిస్టులో 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.

Hydra All set to Demolish Janwada farm house and BRS leads constructions as Reports

లిస్టుతో సిద్దం
మరోవైపు.. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన మల్లారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్మాణాలపై చర్యలకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. కాగా వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70కి పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. జన్వాడలోని ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ ఇదివరకే చెప్పారు. ఆ ఫామ్ హౌస్‌ను లీజుకు తీసుకున్నానని వెల్లడించారు.

కూల్చివేతేనా
మేడ్చల్‌ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలలు, హాస్టళ్లూ చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలేనని ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డికి సంబంధించిన పలు ఆక్రమణలపై కోర్టు స్టేలు ఉండగా.. ఇటీవల కాప్రా సర్కిల్‌ పరిధిలోని నిర్మాణంపై స్టే వెకేట్‌ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు మేడ్చల్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి అనురాగ్ యూనివర్సిటీ భవనాల పైన ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై హైడ్రా నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+