N కన్వెన్షన్ పై రేవంత్ గురి వెనుక - నెక్స్ట్ టార్గెట్..!!
హైడ్రా. ఇప్పుడు ఈ పేరు హైదరాబాద్ లో ఒక సంచలనం. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను సైతం కూల్చివేశారు. అయితే ఎన్ కన్వెన్షన్ గురించి రేవంత్ 2016లోనే అసెంబ్లీలో చెప్పారు. ఇక ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి. ఏం జరగబోతోంది.
హైడ్రా ఏర్పాటుతో
హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఇప్పుడు హైదరాబాద్ లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చటంతో ఇతర ప్రముఖుల్లోనూ ఆందోళన మొదలైంది. అయితే, 2016లోనే హైదరాబాద్ లోని భూ ఆక్రమణలు...చెరువు కబ్జాల పై రేవంత్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఆ సమయంలోనే ఎన్ కన్వెన్షన్ గురించి ప్రస్తావించారు. నగరంలో చెరువులు కబ్జాకు కురవుతూ.. కుశించుకుపోతున్నాయని, అందుకే వరదలు సంభవిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఎనిమిదేళ్ల క్రితమే
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాద్ లో ఈ రకమైన ఆక్రమణల తొలిగింపుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు. హైడ్రా బాధ్యతలను రంగనాధ్ కు అప్పగించారు. ఇప్పటికే కొందరి ప్రముఖుల ఆక్రమణలను గుర్తించారు. కొన్ని వ్యవహారాలు కోర్టుకు చేరాయి. మరి కొందరి లిస్టుతో హైడ్రా సిద్దంగా ఉంది. రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి లేకండా స్వచ్చందంగా పని చేసేలా హైడ్రాకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. బిల్డర్లు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా కూల్చి వేసింది.
హైడ్రా దూకుడు
ఈ ఆక్రమణలతో నగరంలో వర్షం పడితే జల దిగ్బంధనం అవుతోంది. చెరువులు ఆక్రమించి విల్లాలు నిర్మించారు. ఇక..పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఆక్రమణలతో నిర్మాణాలు చేసారు. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు తరువాతి టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. ప్రముఖుల ఫం హౌస్ లు, విల్లాలను ఎక్కడైతే నిబంధనలకు విరుద్దంగా నిర్మించారో వాటి పైన గురి పెట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ - హైడ్రా నిర్ణయాలను నెటిజెన్లు ప్రశంసిస్తూ..హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications