హైడ్రా తాజా నోటీసులు - ఈ సారి టార్గెట్ వారే..!!

హైడ్రా మళ్లీ పని ప్రారంభించింది. గ్రేటర్ పరిధిలో వరుస కూల్చివేతలతో కలకలం రేపిన హైడ్రా కొద్ది రోజులుగా శాంతించింది. ఇప్పుడు తిరిగి 50 మందికి తాజాగా ఆక్రమణల పైన నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులతో పాటుగా ప్రభుత్వ వినియోగ స్థలాల్లో ఆక్రమణలకు కారకులైన వారి పైన ఈ సారి హైడ్రా గురి పెట్టింది. 15 రోజులుగా ఆక్రమణలను తెలిగించక పోతే చర్యలు తప్పవని హైడ్రా నోటీసుల్లో స్పష్టం చేసింది.

హైడ్రా తాజాగా నోటీసులు జారీ చేయటంతో మరో సారి చర్చ మొదలైంది. నగరం పరిధిలో పార్కులు, ఫుట్ ‌పాత్‌లు, నాలాలు, రోడ్లను ఆక్రమించిన వారిపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. వారికి హైడ్రా నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా వాటిని కూల్చివేయాలని సూచించింది. లేకుంటే చర్యలు తప్పని స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా కలకలం రేపటంతో కొద్ది రోజులు హైడ్రా శాంతించింది. నివాసం ఉంటున్న కట్టడాలను కూల్చేది లేదని హామీ స్పష్టం చేసింది. కొత్త నిర్మాణాలకు మాత్రం అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది.

Hydra issues notices for 50 Encroachments constructions in GHMC limits

అదే సమయంలో ప్రభుత్వం హైడ్రాకు అదనపు అధికారాలు కట్టబెట్టింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అప్పగించింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాలను హైడ్రాకు ఇచ్చింది. గ్రేటర్ లో ఆక్రమణల నిర్మూలను వీలుగా జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది. అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా అమలు చేయనుంది.

అందులో భాగంగా హైడ్రా తాజాగా 50 మందికి నోటీసులు జారీ చేసింది.
ముందుగా వారితో చర్చించి.. వారి నుంచి నిర్మాణాలకు సంబంధించిన అనుమతి పత్రాల పైన ఆరా తీసింది. లేని వారికి నోటీసులు జారీ చేస్తోంది. నోటీసులు అందుకున్న వారు ఇచ్చే వివరణ ఆధారంగా హైడ్రా తదుపరి చర్యలకు సిద్దం అవుతోంది. అయితే, ప్రజలు వినియోగించే స్థలాల విషయంలో మాత్రం కఠినంగా ఉండాలని నిర్ణయించింది. చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలపై ఆదిలో ఉక్కుపాదం మోపిన హైడ్రా... తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కొంత కాలంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా హైడ్రా 50 మందికి నోటీసుల జారీతో ఇప్పుడు హైడ్రా మరో సారి ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+