హైడ్రా.. ఎవడ్రా ఆపేది?: ఇంకా బలోపేతం

HYDRA: ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్‌గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది.

HYDRA likely to get Police Station status

మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా వంటి చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్‌మెంట్లను ఇప్పటికే కూల్చివేశారు అధికారులు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ సెంటర్ పాక్షిక కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతలకు స్టే లభించింది.

మున్ముందు- న్యాయపరంగా హైడ్రాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దానికి మరిన్ని అధికారాలను కల్పించేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా- దీనికి పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. సొంతంగా ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసే అధికారాన్ని ఇవ్వనుంది.

కూల్చివేతల సమయంలో ఆక్రమణదారులపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, సంబంధిత సిబ్బందితో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయించడం, మళ్లీ కేసు పురోగతి గురించి తరచూ సంప్రదింపులు నిర్వహిస్తోండటం వల్ల కలుగుతోన్న జాప్యాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

పోలీస్ స్టేషన్ హోదా కల్పిస్తే ఎఫ్ఐఆర్ మొదలుకుని అన్ని కార్యకలాపాలను కూడా హైడ్రా సిబ్బందే దగ్గరుండి పర్యవేక్షించడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కూల్చివేతలకు వ్యతిరేకంగా నమోదవుతున్న కేసులనూ పరిష్కరించుకునే వెసలుబాటు ఉంటుందనీ అంటున్నారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+