వీడియో: హైడ్రా తాజా కొరడా- హోర్డింగ్సూ నేలమట్టం
HYDRAA: రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్‌గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది.

ఇప్పటివరకు ఆక్రమణలకు గురైన మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు, 12 పార్కుల భూములను కాపాడింది హైడ్రా. ఆయా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌లల్లో నిర్మితమైన కట్టడాలను కూల్చివేసింది. ఆ స్థలాలకు విముక్తి కల్పించింది.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లల్లో అక్రమ నిర్మాణాల వల్ల సంభవించే నష్టాలపై ప్రజల్లో అవగాహన సైతం కల్పించనుంది. 1,025 చెరువులకు హద్దులను నిర్ణయించబోతోంది. ఈ హద్దులు మీరి నిర్మించిన ఇళ్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లపై కొరడా ఝుళిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా అక్రమ హోర్డింగులపైనా కొరడా ఝుళిపించింది హైడ్రా. అక్రమంగా వెలిసిన నేలమట్టం చేస్తోంది. వివిధ అడ్వర్టయిజ్‌మెంట్ సంస్థలకు చెందిన హోర్డింగులు అవి. అవన్నీ కూడా అనాథరైజ్డ్‌గా నెలకొల్పినట్లు గుర్తించారు హైడ్రా అధికారులు. వాటిని తొలగించివేస్తోన్నారు.
ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో 42 హోర్డింగులను తొలగించారు. ప్రకాష్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, లీడ్ స్పేస్, యూనీ యాడ్స్, పీవీఎస్ యాడ్స్, ఐకార్ యాడ్స్, ఐస్పేస్ అడ్వర్టయిజ్‌మెంట్స్, సురభి అడ్వర్టయిజ్‌మెంట్, యూకే యాడ్స్, బీ అండ్ ఎం యాడ్స్, సాయినాథ్ యాడ్స్, ఫోర్‌సైట్, ఐ క్యాచ్.. వంటివి ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications