హైదరాబాద్ లో ఇల్లు, ఫ్లాట్ కొనే వారికి హైడ్రా హెచ్చరిక..!
హైదరాబాద్.. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటి. ప్రపంచంలోని మహా నగరాల్లో 41వ స్థానంలో ఉంది. రోజురోజుకీ హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది. అటు ఐటీ, ఫార్మా, టెక్ రంగాల్లో రాష్ట్ర రాజధాని దూసుకెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ లో భారీగా ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు జరుగుతోంది. ఈ క్రమంలో హైడ్రా కీలక సూచనలు చేసింది.
దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు ఊపందుకుంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తి రక్షణ అథారిటీ (HYDRAA) కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ నగరంలో ఏదైనా ఇల్లు, ప్లాట్లు.. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే ముందు వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచనలు చేశారు.
హైదరాబాద్ లో ఇళ్లు, ప్లాట్ల కొనుగోలుదారులు నగరంలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు వివరాలను ధృవీకరించాలన్నారు. హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన భూమిలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఇళ్లు కూల్చివేతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆక్రమణకు గురైన నాలాపై నిర్మించిందా..? లేదా..? అనే దానితో సహా ఆస్తి వివరాలను ధృవీకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా అలాంటి ఆస్తులను కూల్చి వేస్తామని ఆయన తెలిపారు.

మరోవైపు హైదరాబాద్ లో నాలాల ఆక్రమణలకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 47 పిటిషన్లు వచ్చాయని హైడ్రా ఓ ప్రకటనలో పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రమాదాలను తగ్గించడానికి రానున్న రోజుల్లో పూడిక తొలగింపు, ఆక్రమణల నిరోధక కార్యకలాపాలు వేగవంతం కానున్నట్లు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications