మియాపూర్ లో 5 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్ లోని మియాపూర్ ప్రాంతంలో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది. రూ. కోట్ల రూపాయలు విలువ చేసే మరో ప్రభుత్వ స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం సంరక్షించింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. ఆ భవనం, స్థలం అక్రమమేనని హైడ్రా పరిశీలనలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైడ్రా సంస్థ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో ప్రకటన చేసింది.

మియాపూర్ లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అమీన్ పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 100 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేసినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. ఆ భవనం, స్థలం అక్రమమేనని హైడ్రా పరిశీలనలో తేలింది. దీంతో ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది.

మియాపూర్ లో సర్వే నెంబర్లు మార్చి అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించింది హైడ్రా. ప్రభుత్వ స్థలంలోని హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తీసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా విచారణలో గుర్తించింది. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హెచ్ఎండీఏ, హైడ్రా అధికారులు శనివారం ఉదయం రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమంగా నిర్మించిన అపార్ట్ మెంట్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు.

HYDRAA s Mega Bulldozer Raid 5-Storey Illegal Tower Crumbles in Miyapur

మరోవైపు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్.. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని రెహ‌మ‌త్‌ న‌గ‌ర్‌, బోర‌బండ ప్రాంతాల్లో నాలాల్లోని పూడికతీత ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. నాలాల్లో పూడికతీత ప‌నుల‌కు, వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటంకాల‌ను తొల‌గించేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా భావించాల‌ని తెలిపారు. ప్రాంతాల వారీగా వాట్సాప్ గ్రూప్‌ లను ఏర్పాటు చేసి స‌మాచారాన్ని చేర‌వేయాల‌ని సూచించారు. దాంతోపాటు హ‌రిహ‌ర‌పురంలోని కాప్రాయి చెరువు, శంషాబాద్‌, పెద్ద‌ గోల్కొడ‌లోని న‌ర‌సింహ చెరువు, బాలాపూర్ లోని కోమ‌టి కుంట‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+