Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను మీ ‘పప్పు’లా కాదు: ఆధారాలతో కాంగ్రెస్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్

హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల, టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు చేశారు.

'నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు.' అని ఉత్తమ్‌కు కేటీఆర్‌ చురకలింటించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆర్టికల్‌తో ఆయన ట్వీట్ చేశారు.

I am not like Pappu: KTR to Uttam Kumar

కాగా, 2014 ఎన్నికల్లో భాగంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇటీవల అమెరికాలో కేటీఆర్‌ అంట్లూ తోమాడని ఉత్తమ్‌, రేవంత్‌ రెడ్డిలు ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వారి అధినేత రాహుల్‌ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. అలాగే ఆపిల్‌ కంపెనీ వ్యవహారంలో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియా చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్‌లో కేటీఆర్‌ తిప్పికొట్టారు.' ఏఐసీసీ జెంటిల్‌మెన్‌.. స్కాంగ్రెస్‌ జోకర్‌ ఆజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 2016లోనే ఆపిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో తన వ్యవహారాలను ప్రారంభించింది. ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులతో అమెరికా తర్వాత ఇది అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది' అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలను తిప్పికొట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+