బిగ్ బ్రేకింగ్ : iBomma నిర్వాహకుడు అరెస్ట్ !

ప్రముఖ పైరసీ సినిమా వెబ్ సైట్ ఐ బొమ్మ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమా నెట్‌వర్క్ వ్యవహారంలో కీలకంగా వినిపించే పేర్లలో ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ పోలీసులు ఐ బొమ్మకి బిగ్ షాక్ ఇచ్చారు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా కొద్దిరోజుల క్రితమే ఈ పైరసీ వెబ్ సైట్ లపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవి..

కాగా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి గతరాత్రి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. అతను చాలా కాలంగా విదేశాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేకంగా కరీబియన్ దీవుల్లో ఉండి iBomma వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

i-bomma-organiser-immadi-ravi-arrested-by-telangana-police

అలానే రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్ల నిధులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ డబ్బు మొత్తం సినిమాల పైరసీ ద్వారా వచ్చిన ఆదాయమేనని అధికారులు అనుమానిస్తున్నారు. దేశంలోని పలు బ్యాంకుల్లో రవికి ఉన్న లావాదేవీలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

కాగా ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేపట్టి పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠా వల్ల తెలుగు మూవీ ఇండస్ట్రీకి సుమారుగా రూ.3,700 కోట్ల నష్టం వచ్చిందని కూడా పోలీసులు తెలిపారు. ఆ క్రమంలోనే త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు.

ఆ తర్వాత ibomma ప్రకటనలో తెలుగు సినీ ఇండస్ట్రీపై, పోలీసులపై ఘాటు విమర్శలు చేయడం తీవ్ర చర్చకు తెరలేపింది. హీరోలకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌లు, విదేశీ ట్రిప్పులు, జల్సాలు, భారీ షూటింగ్ ఖర్చులు పెట్టి.. చివరికి ప్రేక్షకులపై భారమేస్తున్నారని తమ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే.. మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్ సైట్లు మీద మీ దృష్టి పెట్టండని పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+