భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే?
తన భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదని ఓ వివాహిత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించింది. 15 ఏళ్ళ వయస్సులో తన మేనబావ శ్రీకాంత్ గౌడ్.
హైదరాబాద్ :చిన్నతనంలోనే తనకు ఇష్టంలేని పెళ్ళిచేశారని, తన భర్త తనను కాపురానికి రావాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ వివాహిత ఆరోపిస్తోంది. తన భర్త నుండి తనకు రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.
తనకు 15 ఏళ్ళ వయస్సులో మేనబావ శ్రీకాంత్ గౌడ్ తో వివాహన్ని పెద్దలు జరిపించారని, ఇష్టం లేకపోయినా, పెద్ద లను ఎదిరించే సాహసం చేయలేక రెండు మాసాలు శ్రీకాంత్ గౌడ్ తోనే ఉన్నానని బాధితురాలు చెబుతోంది.

తన మేనబావ శ్రీకాంత్ గౌడ్ ప్రవర్తన సరిగా లేని కారణంగా తల్లిదండ్రుల వద్దకు చేరినట్టు ఆమె చెప్పారు. అయితే తనను కాపురానికి రావాలని భర్త శ్రీకాంత్ గౌడ్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.అంతేకాకుండా తనకు లాయర్ ద్వారా నోటీసులను కూడ పంపారని ఆమె గుర్తుచేశారు.
స్థానికంగా ఉన్న మహిళ సంఘాల నాయకులు, బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపారు. వివాహ సమయంలో శ్రీకాంత్ గౌడ్ కు ఇచ్చిన 15 తులాల బంగారు నగలు, పది లక్షల రూపాయాలను తిరిగి ఇవ్వాలని ఆమె కోరారు.అంతేకాదు తాను మైనర్ అని తెలిసి కూడ వివాహం చేసుకొన్న శ్రీకాంత్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications