ఇప్పుడే సీఎం కావాలని లేదు, హరీష్‌తో గ్యాప్ లేదు, కాంగ్రెస్‌లోకి వెళ్లరు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశ లేదని, మంత్రి హరీష్ రావుకు తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పారు.
హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడని తేల్చి చెప్పారు. తనకు, ఆయనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఇరువురం సమన్వయంతో వెళ్తున్నామని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం మరో పదేళ్లు అవసరమని చెప్పారు. మూడేళ్లలో కేసీఆర్ అద్భుతాలు చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు మొహం మొత్తిందని చెప్పారు. తాను సభళు నిర్వహించడం యాదృచ్ఛికమేనని చెప్పారు. మున్సిపల్ మంత్రిని అయ్యాక ప్రజలతో తనకు మమేకం తగ్గిందని చెప్పారు. అందుకే సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతే తప్ప కేసీఆర్ తర్వాత తానే అనే కోణంలో కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications